Epsilon Variant Found in Pakistan: కరోనా (Corona Virus) వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. కొన్ని దేశాలలో కరోనా విజృంభణ తగ్గినా.... మరి కొన్ని దేశాలలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. యూకేలో రోజు 50 వేల కేసులు నమోదు అవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. డెల్టా ఉత్పరివర్తనాలే వేగంగా వ్యాప్తి చెందటం వలన ప్రపంచ దేశాలు మళ్లీ భయాందోళనకు గురి అవుతున్నాయి.
క్యాలిఫోర్నియాలో ఎప్సిలాన్ వేరియంట్‌గా (Epsilon Variant) పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కాలిఫోర్నియాలో (California) మొదట గుర్తించిన కారణంగా దీనిని క్యాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా బి 1.429 గా పిలుస్తారు. ఈ వేరియంట్ వల్లనే అమెరికా (America), యూకే (UK) లలో వీపరీతంగా వ్యాప్తి చెంది రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి మరియు కరోనా (Corona) మరణాలు సంఖ్య కూడా అధికంగానే ఉంది.
Also Read: Pawan Kalyan & Rana Daggubati Photo: ఒకరు భీమ్లా నాయక్.. మరొకరు డేనియల్ శేఖర్.. తగ్గేదేలే!
అయితే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్లను మన పొరుగు దేశం పాకిస్తాన్లో గుర్తించారు. పాకిస్తాన్లో కూడా కేసులు సంఖ్య మళ్లీ పెరగటం, ఈ వేరియంట్ వల్లనే కేసులు అధికంగా పెరుగుతున్నాయని పాక్ ఆరోగ్య శాఖ (Ministry of National Health Services Pakistan) పేర్కొంది. ఎప్సిలాన్ వేరియంట్ (Epsilon Variant) గా పిలిచే కోవిడ్ వేరియంట్ (Covid Variant)లో ఐదు రకాల వేరియంట్లను గుర్తించగా.. ఈ వేరియంట్ కు సంబందించిన ఏడు మ్యూటేషన్లను పాక్ లోనే గుర్తించటం ఆందోళనకు గురి చేస్తుంది
మళ్లీ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే ఇంకా కరోనా శకం ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో (World Health Organization) పాటు.. పాకు ఆరోగ్య సంస్థ వారి దేశ ప్రజలను హెచ్చరించింది.
Also Read: Sammathame movie First Glimpse : ‘సమ్మతమే’ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి