Omicron: కెనడాలో ఒమిక్రాన్ కలకలం-15 కేసులు గుర్తింపు-ఆరోగ్య శాఖ కీలక విజ్ఞప్తి

Omicron cases in Canada: కెనడాలో 15 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీరిలో 11 మంది ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చినవారే. ఒమిక్రాన్ డెల్టా కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కెనడా ఆరోగ్య శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 10:57 AM IST
  • కెనడాలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం
  • 15 ఒమిక్రాన్ కేసులు గుర్తించిన వైద్యాధికారులు
  • 15 మందిలో 11 మంది విదేశాల నుంచి వచ్చినవారే
Omicron: కెనడాలో ఒమిక్రాన్ కలకలం-15 కేసులు గుర్తింపు-ఆరోగ్య శాఖ కీలక విజ్ఞప్తి

Omicron cases in Canada: ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ (Omicron) భయం వెంటాడుతోంది. ఒమిక్రాన్ ప్రాణాంతకమా కాదా అన్నది ఇంకా తేలనప్పటికీ.. వ్యాప్తి రీత్యా డెల్టా కంటే ప్రమాదకారి కావడంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందడంతో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. తాజాగా కెనడాలో (Canada) 15 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మున్ముందు దేశవ్యాప్తంగా తీవ్ర అనారోగ్యం ప్రబలే అవకాశం ఉందని కెనడా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

కెనడాలో (Omicron cases in Canada) 50 ఏళ్లు పైబడినవారంతా తప్పనిసరిగా బూస్టర్ డోస్ (Booster Dos) తీసుకోవాల్సిందిగా ఆ దేశ ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన ఆర్నెళ్లకు ఈ బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో సౌతర్న్ ఆఫ్రికా దేశాల నుంచి విమాన రాకపోకలపై కెనడా ఇప్పటికే నిషేధం విధించింది. అమెరికా మినహా మిగతా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 టెస్టును తప్పనిసరి చేసింది.

ఏ వేరియంట్ వ్యాప్తిలో ఉన్నా సరే... అంతా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కెనడా (Canada) చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ తెరెసా టామ్ తెలిపారు. కెనడాలో ఇప్పటివరకూ గుర్తించిన ఒమిక్రాన్ కేసుల్లో 11 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించారు. ఇప్పటికైతే కెనడాలో తీవ్ర అనారోగ్య కేసులు తగ్గుముఖం పట్టాయని... కానీ కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరిగితే పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు రావొచ్చునని అన్నారు. కెనడాలో ఒమిక్రాన్ (Omicron) బారినపడిన 15 మందిలో ఓ 12 ఏళ్ల ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం. ఆ చిన్నారి ఇటీవలే సౌతర్న్ ఆఫ్రికా నుంచి కెనడాకు వచ్చినట్లు గుర్తించారు.

Also Read: Hyderabad: విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News