Canada Cost of Living: కెనడాలో చదువుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇక నుంచి మరింత ప్రియం కానుంది. కెనడాలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ప్రస్తుతం అయ్యే ఖర్చు కంటే రెట్టింపు అవుతుందని కెనడా ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. దీంతో అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక భారంకానుంది. కెనడాలో జీవితం మరింత ఖర్చుతో కూడుకున్నదిగా మారనుందని మిల్లర్ చెప్పారు. కొంతమంది చేతిలో దుర్వినియోగం, దోపిడీకి గురైన దేశంగా మారామని ఆయన అన్నారు. కొత్త నిబంధనలు జనవరి 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. స్టడీ పర్మిట్ దరఖాస్తుదారులు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ విద్యార్థులు తమ కమ్యూనిటీల నుంచి సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే వారు కెనడాలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడంతో అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడ నివసించడానికి అయ్యే ఖర్చును ముందుగా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. కెనడాలో సక్సెస్ అవ్వాలంటే.. ముందు ఆర్థిక లెక్కలు వేసుకోవడం తప్పనిసరి. అంతర్జాతీయ విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బంది పడకుండా తగిన వసతిని పొందేలా చూసేందుకు తాము చూస్తున్నామని మిల్లర్ వెల్లడించారు.
ఒక విద్యార్థికి 2 వేల డాలర్ల నుంచి 10 వేల డాలర్లు ఖర్చు అవుతుండగా.. అయితే అభివృద్ధి చెందుతున్న లైఫ్ స్టైల్‌కు తగినట్లు ఇప్పుడు 20,635 డాలర్లకు పెరిగింది. స్టాటిస్టిక్స్ కెనడా LICOతో ఏటా అప్‌డేట్ చేస్తున్న ఈ సర్దుబాటు.. కెనడాలో జీవితంలోని ఆర్థిక అవసరాల కోసం అంతర్జాతీయ విద్యార్థులు తగినంతగా సిద్ధంగా ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
కెనడాలో విద్యార్థులను ఎన్ని గంటలు పని చేయడానికి అనుమతించాలో ఒట్టావా సమీక్షిస్తున్నట్లు మిల్లెర్ తెలిపారు. వారానికి 20 గంటలకు పరిమితం చేస్తే నిబంధనలు కఠినతరం చేసినట్లు అవుతుందన్నారు. అయితే వారానికి 40 పని గంటలు అనుమతిస్తే.. ఎక్కువమంది వచ్చేందుకు వీలుంటుందన్నారు. కానీ చదువుల మీద ఎక్కువ దృష్టిపెట్టలేరని అన్నారు. మైగ్రెంట్ స్టూడెంట్స్ కెనడా నిబంధనలు పూర్తిగా తెలుసుకుని రావాలని సూచించారు. కొత్త ఆదాయ అవసరాల ఫలితంగా కెనడాలో చదువుకోలేని అంతర్జాతీయ విద్యార్థుల తక్కువ ప్రాతినిధ్యం వహించే కోహోర్ట్‌ల కోసం పైలట్ ప్రోగ్రామ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి