Baby Born: విమానంలో పురిటినొప్పులు.. సెల్‌ఫోన్‌లో చూసి 'డెలివరీ' చేసిన పైలెట్‌

VietJet Flight Baby Born: విమానంలో మహిళ పురిటినొప్పులతో బాత్రూమ్‌లో పడిపోగా సమయానికి వైద్యులు లేకపోవడంతో విమానం నడిపే పైలెట్‌ డెలవరీ చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2024, 03:40 PM IST
Baby Born: విమానంలో పురిటినొప్పులు.. సెల్‌ఫోన్‌లో చూసి 'డెలివరీ' చేసిన పైలెట్‌

Born In The Air: నిండు గర్భిణి వేరే ప్రాంతానికి వెళ్తుంటే అకస్మాత్తుగా విమాన ప్రయాణంలో పురిటినొప్పులు వచ్చాయి. ఆపద సమయంలో విమానంలో ఎవరూ వైద్యులు లేకపోవడంతో విమానం నడిపే పైలెట్‌ స్పందించి ఆమెకు ప్రసవం చేశారు. సెల్‌ఫోన్‌ ద్వారా బాధితురాలికి సపర్యలు చేసి ప్రసవం సురక్షితంగా జరిగేలా చేశాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. సాహసోపేతంగా పైలెట్‌ స్పందించి కాపాడడంతో ప్రయాణికులతోపాటు నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Kalpana Soren: భర్తను తలచుకుని ప్రజల మధ్య కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం భార్య

తైవాన్‌ నుంచి బ్యాంకాక్‌కు వీట్‌జెట్‌కు చెందిన విమానం ప్రయాణమైంది. ఈ విమానంలో నెలలు నిండిన ఓ గర్భిణి ప్రయాణికులు కూడా ఎక్కారు. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమె బాత్‌రూమ్‌లో ఉండిపోయింది. ఏం చేయాలో తెలియక విమాన సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. విమానంలో వైద్యులు ఎవరైనా ఉన్నారా? అని విచారించగా ఎవరూ లేరు. దీంతో విమానం నడుపుతున్న పైలెట్‌ జకారిన్‌ సారర్న్‌రక్‌స్కుల్‌ స్పందించారు. వెంటనే తన బాధ్యతలను కో పైలెట్‌ అప్పగించి మహిళ వద్దకు వచ్చారు. సెల్‌ఫోన్‌లో వైద్యులను సంప్రదించారు. వైద్యులు సూచనలు చేస్తుండడంతో వాళ్లు చెప్పినట్లు జకారిన్‌ వైద్యం చేశాడు. అనంతరం చివరికి ప్రశాంతంగా మహిళకు పురుడు పోశాడు. పండంటి బిడ్డ పుట్టింది.

Also Read: Lock In Assembly: ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి తాళం వేయండి.. స్పీకర్‌కు తాళం ఇచ్చిన సీఎం

ప్రసవం అత్యంత క్షేమంగా జరగడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్‌ చేసిన పనికి ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. అయితే విమానంలో పుట్టడంతో ఆ పాపకు 'స్కై' అనే పేరు పెట్టడం గమనార్హం. విమానం దిగాక తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. 18 ఏళ్లుగా జకారిన్‌ పైలెట్‌గా పని చేస్తున్నారు. తన కెరీర్‌లో ఇలాంటి పరిణామాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని పైలెట్‌ జకారిన్‌ తెలిపాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News