Rainbow Pluto: ఖగోళ విషయాలు ఎప్పుడూ ఆసక్తిని కలగజేస్తాయి. అంతులేని ఆ ఖగోళానికి సంబంధించి ఇప్పటికీ ఎన్నో విషయాలు మిస్టరీగానే ఉన్నాయి. ఆ రహస్యాలను చేధించేందుకు మానవ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నాసా, ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు అప్పుడప్పుడు ఖగోళానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్లూటో గ్రహానికి సంబంధించిన ఓ అద్భుత చిత్రాన్ని విడుదల చేసింది.
ఈ చిత్రంలో ప్లూటో రెయిన్‌బో రంగులతో మెరుస్తోంది. ఈ ఫోటోని నాసా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీన్ని చూడగానే చాలామంది ప్లూటో నిజంగానే రెయిన్‌బో కలర్‌లో ఉందేమోనని పొరబడుతారు. కానీ అసలు విషయం అది కాదు. ఈ ఫోటోని న్యూ హారిజన్స్ సైంటిస్టులు క్రియేట్ చేసినట్లు నాసా వెల్లడించింది. ఆ గ్రహంలోని విభిన్న ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేసేందుకు ఇలా రంగులతో కూడిన చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది.
గత కొన్నేళ్లుగా ప్లూటోపై న్యూ హారిజన్స్ పరిశోధనలు కొనసాగుతున్నాయని... పర్వతాలు, లోయలు, భారీ గుంతలతో ప్లూటో గ్రహం చాలా వైవిధ్యమైన, సంక్లిష్టమైన గ్రహమని నాసా పేర్కొంది. నాసా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోకి 24 గంటల్లోనే 9 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి.
Also Read: Mars Transit: మేష రాశిలోకి కుజుడు.. ఈ నెల 27 నుంచి ఈ 3 రాశుల వారికి మహర్దశ..
Also Read: CM KCR:విపక్షాల కూటమికి కేసీఆర్ షాక్.. ఈడీ కేసులకు భయపడుతున్నారా?