Mars Solar Eclipse: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఆరు రోజుల్లో ఉంది. భూమి నుంచి సూర్యగ్రహణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఇతర గ్రహాల్నించి ఎలా కన్పిస్తుంది. నాసా అలాంటి ఫోటో ఒకటి విడుదల చేసింది.
ఖగోళంలో భూమి వంటి గ్రహాలు ఇంకా ఉన్నాయి. సూర్య గ్రహణం మనకు ఏర్పడినట్టే ఇతర గ్రహాలకూ ఏర్పడుతుంటుంది. భూమిపై ఉన్న మనందరికీ సూర్య గ్రహణం ఎలా ఉంటుందనేది తెలిసిందే. సూర్య గ్రహణంపై వివిధ మతాల్లో వివిధ నమ్మకాలుంటాయి. సూర్య గ్రహణం చూడటం గానీ, ఆ సమయంలో తినడం గానీ, లేదా శుభకార్యాలు చేయడం గానీ అశుభంగా భావిస్తారు. అయితే ఇదే సూర్య గ్రహణం ఇతర గ్రహాల్నించి ఎలా కన్పిస్తుందనేనేది అమెరికాకు చెందిన నాసా వివరించింది. మార్స్ గ్రహం అంటే మంగళ గ్రహం నుంచి సూర్య గ్రహణం ఎలా కన్పిస్తుందో తెలిపే ఓ ఫోటో విడుదల చేసింది.
అంతరిక్ష స్పేస్ ఏజెన్సీ పర్స్‌వేరెన్స్ రోవర్..మంగళ గ్రహం నుంచి కొన్ని ఫోటోలు క్యాప్చర్ చేసింది. 2021 ఫిబ్రవరి నుంచి ఈ రోవర్ మంగళగ్రహంపైనే ఉంది. ఏప్రిల్ 2 నుంచి అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన కెమేరాతో ఫోటోలు క్యాప్చర్ చేస్తోంది. భూమికి చంద్రుడు ఎలానో...మంగళ గ్రహానికి ఫోబోస్ గ్రహం అటువంటిది. మంగళ గ్రహానికి సూర్య గ్రహానికి మధ్యన ఫోబోస్ వచ్చిన సందర్భంగా అక్కడ ఏర్పడిన సూర్య గ్రహణం ఫోటోల్ని ఈ రోవర్ తీసింది. మంగళ గ్రహానికి ఫోబోస్ ఉప గ్రహం. ఇది 17/14/11 మైళ్ల వ్యాసార్ధంతో ఉంటుంది.
భూమి చుట్టూ చంద్రుడు రోజుకోసారి పరిభ్రమిస్తే..ఫోబోస్ మాత్రం మంగళ గ్రహం చుట్టూ రోజుకు మూడుసార్లు తిరుగుతుంది. అయితే చంద్రుడున్నట్టు గోళాకారంగా ఉండదు. బంగాళదుంపలా ఓ నిర్ధిష్ట ఆకారం లేకుండా ఉంటుంది. చంద్రుడితో పోలిస్తే ఫోబోస్ చాలా చిన్నది. దాదాపు 157 రెట్లు చిన్నది. రోవర్స్‌లో స్పిరిట్, ఆపర్చ్యూనిటీ, క్యూరియాసిటీ కలిపి ఉన్నాయి. ఈ రోవర్ మంగళ గ్రహం నుంచి అన్ని ఇతర గ్రహాల ఫోటోల్ని తీసి పంపుతుంటుంది.
Also read: Oil Refinery Blast: ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు, వందమందికి పైగా సజీవ దహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.