/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

World Milk Day 2023: పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. ఇందులో చాలా రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే పెద్దల నుంచి వైద్యుల వరకు అందరూ పాలు తాగమని సలహా ఇస్తున్నారు.ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.. కాబట్టి శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. పాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాడి పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించడమే పాల దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ప్రతి సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో, ఈ దినోత్సం ప్రాముఖ్య ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ పాల దినోత్సవం చరిత్ర:
పాడి పరిశ్రమను గుర్తించి, పాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితిలోని ఆహార, వ్యవసాయ సంస్థ 2001లో ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

ప్రపంచ పాల దినోత్సవం థీమ్:
ప్రతి సంవత్సరం పాల దినోత్సవ థీమ్‌ను ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవం థీమ్.."అందరికీ పౌష్టికాహారం, జీవనోపాధిని అందించి పర్యావరణం కాపాడుకుందాం"  అనే థీమ్‌తో ముందుకు నడవాలని పేర్కొంది. అంతేకాకుండా ప్రతి రోజు పాలు తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు క్లుప్తంగా వివరించడం థీమ్‌ ప్రత్యేకత.

శ్వేత విప్లవం అంటే ఏమిటి?:
కురియన్ 1970లో శ్వేత విప్లవాన్ని ప్రారంభించారు. భారతదేశంలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు పాల వల్ల వచ్చే ఆదాయాలను ఈ విప్లం ద్వారా తెలియజేశారు. 1965 నుంచి 1998 వరకు డాక్టర్ వర్గీస్ కురియన్ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి మూలకు పాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. ఆయన కృషి వల్లే నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా నిలిచింది.

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
World Milk Day 2023: Do You Know Why World Milk Day Is Celebrated Every Year What Is The White Revolution
News Source: 
Home Title: 

World Milk Day 2023: ప్రతి సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా, శ్వేత విప్లవం అంటే ఏమిటి?

World Milk Day 2023: ప్రతి సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా, శ్వేత విప్లవం అంటే ఏమిటి?
Caption: 
source file : zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్రతి సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Thursday, June 1, 2023 - 12:28
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
60
Is Breaking News: 
No
Word Count: 
279