AP Corona Positive Cases | ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం భారీగానే ఉంది. వైఎస్ జగన్ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 657 కరోనా పాజిటివ్ కేసులు(CoronaVirus) నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 611 మందికి కరోనా సోకగా, మిగతా 46 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు(AP COVID19 Cases) 15,252కు చేరుకున్నాయి. First vaccine: భారత్ లో తొలివ్యాక్సీన్ తీసుకునేది ఎవరు ?
రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 6988 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 8,071 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఆరుగురు కరోనాతో పోరుడుతూ మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 193కి చేరింది. హీరో నితిన్ పెళ్లి తేది, వేదిక ఖరారు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,239 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 657 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 342 మంది ప్రాణాంతక కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. Nepotism: సినీ ఫ్యామిలీ నుంచి నటుడు తెరంగేట్రం
నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,18,429 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 12,813 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,036 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 403 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!