CM YS Jagan: గాల్లోకి లేచిన చీపురు.. సీఎం హెలికాప్టర్ కు తప్పిన పెను ప్రమాదం.. అధికారులు సీరియస్..

Andhra Pradesh Politics: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో హెలిప్యాడ్ ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ ల్యాండింగ్ అవుతున్న నేపథ్యంలో గాల్లోకి ఒక్కసారిగా చీపురు పైకి లేచింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Mar 19, 2024, 11:20 AM IST
  • సీఎం వైఎస్ జగన్ పర్యటనలో ఊహించని ఘటన..
  • హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా తప్పిన ప్రమాదం..
CM YS Jagan: గాల్లోకి లేచిన చీపురు.. సీఎం హెలికాప్టర్ కు తప్పిన పెను ప్రమాదం.. అధికారులు సీరియస్..

Narrow Escape For AP CM YS Jagan Mohan Reddy Chopper Landing: కేంద్ర ఎన్నిక సంఘం ఎన్నికల సంఘటం లోక్ సభతో పాటు, నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణలోకి కంటోన్మెంట్ పరిధిలోని స్థానానికి ఉపఎన్నికకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో దేశంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలకు, నాయకులు, అధికారులు పాటించాల్సిన విధివిధానాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఆయా రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం జోరును పెంచారు.

Read More:Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

కేంద్రం నుంచి  రాష్ట్ర ముఖ్య నేతల వరకు కూడా నాయకులు పార్టీ బహిరంగ సమావేశాలు, పబ్లిక్ మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. ఈక్రమంలోనే. . ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 14 న అనంతపురం జిల్లాలో పర్యటించారు. సీఎం జగన మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండింగ్ అయ్యే సమయంలో ఊహించని  ఘటన ఎదురైంది. ఆ సమయంలో పెద్ద ఎత్తున వచ్చిన గాలికి ఒక చీపురు గాల్లోకి పైకి ఎగిరింది. దీంతో పైలెట్ అప్రమత్తమయ్యాడు.

సీఎంజగన్ అనంతపురం జిల్లాలోని కొనకొండ్లలోలో స్థానికంగా కార్యక్రమంలో హజరవ్వడానికి వచ్చారు. అప్పుడు అధికారులు ప్రత్యేకంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేయడానికి ప్రత్యేకమైన ప్రదేశం ను ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక్కసారిగా అనుకోని ఘటన జరిగింది. సీఎం హెలికాప్టర్ గాల్లో నుంచి కిందకు ల్యాండ్ అవుతుండగా.. గాల్లో చీపురు ఎగిరి పైకి వచ్చింది. దీంతో పైలెట్ అప్రమత్తమయ్యాడు.

Read More: Venomous Snake: లోదుస్తులు పెట్టే ర్యాక్ లో ప్రపంచంలోనే రెండో అత్యంత విషసర్పం.. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసా..?

హెలికాప్టర్ ను కొన్నిసెకన్లపాటు గాల్లోపైనే ఉంచాడు. అది పైకి ఎగిరి విమానం రెక్కలకు తాకుంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్బంగా అలర్ట్ గా ఉండాల్సిన అధికారులు ఇలా పూర్తిగా నిర్లక్ష్యం వహించడంపై సీఎం ప్రత్యేక సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, సీఎం జగన్ మోహన్ తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

by Taboola

Sponsored Links

You May LikeI'll die of this disease if I don't get treatment at the earliest. Help me!Ketto IN INR

Add a ‘Dr.’ to your nameGolden Gate University

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News