AP Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, కోస్తా ప్రాంతంలో సముద్ర మట్టానికి5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దాంతో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజులు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ దక్షిణ కోస్తా పరిధిలో నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. నిన్న కూడా ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక డిసెంబర్ నెలలో పెద్దఎత్తున తుపాను హెచ్చరికలనున్నాయి. డిసెంబర్ నెలలో ఏర్పడే తుపాన్లలో 70 శాతం తీవ్ర తుపాన్లుగా బలపడనున్నాయి. వీటిలో అత్యధికశాతం పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో తీరం దాటవచ్చు. ఇప్పటి నుంచే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి అవసరమైతే తరలించేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు ఉపరితల ఆవర్తనం, తుపాను హెచ్చరికలు వస్తున్నా వాతావరణంలో మాత్రం మార్పు రావడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వేసవిని తలపించేలా పగటి పూట ఎండలు ఉంటున్నాయి. ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనం మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Also read: DSC: మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్.. 16,347 ఉద్యోగాల భర్తీకి ఆరోజే నోటిఫికేషన్ రిలీజ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.