AP Chief Secretary Sameer Sharma Hospitalised Again: ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఒక రివ్యూ మీటింగ్ లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో అప్పటికప్పుడు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. సచివాలయానికి దగ్గరలో ఉన్న మణిపాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు సమీర్ శర్మను అధికారులు తరలించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బ్యాంకర్స్ అసోసియేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉండగా సమీర్ శర్మ ఒక పక్కకు ఒరిగి పోయినట్లు తెలుస్తోంది.
దీంతో ఆయనకు ఏదో ఇబ్బంది ఏర్పడిందనే ఉద్దేశంతో వెంటనే హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు,. తర్వాత కొంతకాలం బెడ్ రెస్ట్ తీసుకుని సుమారు వారం రోజుల నుంచి తిరిగి విధుల్లోకి వస్తున్నారు. మరోసారి ఆయనకు తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో ఆయనను హుటాహుటిన మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
నిజానికి సమీర్ శర్మ కొన్నాళ్ల క్రితమే అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత కారణాలతో అనారోగ్యానికి గురైన ఆయన వెంటనే ఓ ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆయనకు వైద్యులు చికిత్స అందించారు, అంతేకాక శస్త్ర చికిత్స కూడా చేశారు. ఆ సమయంలో సమీర్ శర్మను ముఖ్యమంత్రి జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా వివిధ పదవులు నిర్వహించారు. సెప్టెంబర్ 2021లో ఆయన ఏపీ సీఎస్ గా నియమితులు అయ్యారు.
Also Read: YSRCP MLC passed away: వైసీపీలో తీవ్ర విషాదం.. మొన్న తండ్రి ఇప్పుడు కొడుకు.. కీలక నేత కన్నుమూత!
Also Read: Chintakayala Ayyanna Patrudu: నర్సీపట్నంలో అర్ధరాత్రి హైడ్రామా.. మాజీ అయ్యన్న పాత్రుడు అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook