కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షణ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) ప్రారంభమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తొలి వ్యాక్సిన్‌ను హెల్త్ వర్కర్ నాగజ్యోతి ( Health worker Nagajyothi ) కి ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ముందు వ్యాక్సినేషన్ విధానాన్ని పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3 లక్షల 87 వేల మందికి తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విజయవాడ గన్నవరంలో ఉన్న స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన కేంద్రాల వద్ద ఫ్రంట్‌లైన్ వర్కర్కకు ( Frontline workers ) ముందుగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఒక్కొక్క కేంద్ర వద్ద రోజుకు వందమందికి చొప్పున రోజుకు..33 వేల 2 వందల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
మొదటి డోసు ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగనుంది. తరువాత 28 రోజులకు రెండవ డోసు ఇస్తారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్ ( Covishield ), 20 వేల కోవ్యాగ్జిన్ ( Covaxin ) డోసులు చేరాయి. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. బౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత ఎవరిలోనైనా సైడ్ ఎఫెక్ట్స్ కన్పిస్తే వెంటనే వైద్యసేవలందిస్తారు.
Also read; AP: టీడీపీ సీనియర్ నేత బీజేపీకి జంప్ ? అసంతృప్తులపై దృష్టి పెట్టిన బీజేపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook