Ys jagan to Vizag: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు. దసరా నాటికి షిఫ్ట్ పాలన విశాఖకు మారనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. అన్నింటికీ మించి ముహూర్తాన్ని కూడా పండితులు ఖరారు చేసినట్టు సమాచారం. కోర్టు విచారణతో సంబంధం లేకుండా మకాం మార్చేందుకు జగన్ సిద్దమయ్యారు.
విశాఖపట్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డెస్టినేషన్ క్యాంప్. ప్రభుత్వం విశాఖపట్నంకు ఇస్తున్న ప్రాధాన్యతలు చూస్తే చాలు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నగరమని చెప్పవచ్చు. ఏపీ భవిష్యత్ అంతా ఇక్కడి నుంచే ఉండవచ్చు. ఇప్పుటికే రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం..త్వరలో అతి కీలక నగరంగా మారనుంది. సెకండ్ ముంబైగా భవిష్యత్‌లో అవతరించే లక్షణాలు విశాఖకు సంపూర్ణంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి తన నివాసాన్ని, పాలనను విశాఖకు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ నుంచి ఓసారి, ఏప్రిల్ నెలలో విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వేదిక నుంచి మరోసారి విశాఖపట్నానికి మకాం మారుస్తానని, ఇక్కడ్నించే పాలన ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.
ఇందుకు తగ్గట్టుగానే సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. రుషికొండలో నిర్మిస్తున్న భవన సముదాయంలోనే ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం ఉండవచ్చని సమాచారం. దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఇంటీరియర్ పనులు మిగిలున్నాయి. ఇక ఏపీఎస్సీ బెటాలియన్ అవుట్ పోస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం పనులను కూడా అధికారులు పరిశీలించారు. అక్టోబర్ 24 నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు మకాం మార్చవచ్చని దాదాపుగా ఖరారైంది.
అయితే ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ పాలనను విశాఖ నుంచి ఎలా ప్రారంభిస్తారనే చర్చ జరుగుతోంది. కానీ కోర్టు అంశానికి ముఖ్యమంత్రి జగన్ మకాం లేదా పాలన విశాఖ నుంచి ప్రారంభించేందుకు సంబంధం లేదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా తనకు నచ్చిన చోటి నుంచి పాలన చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. దీనికి చట్టపరమైన సమస్యలేవీ ఉండవు. అందుకే అక్టోబర్ 24 దసరా పర్వదినం నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించనుండటం దాదాపుగా ఖరారైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook