AP Nominations 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కాస్సేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమౌతూనే నేతల నామినేషన్ల సందడి మొదలైంది.
ఇవాళ్టి నుంచి నామినేషన్ల సందడి ప్రారంభం కావడంతో వివిధ పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి ఆది నారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అటు తాడిపత్రిలో వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం ఇవాళ తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్ధి బుట్టా రేణుక సైతం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా భూమా అభినయరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరిలో గాలి భాను ప్రకాష్, రైల్వే కోడూరులో వైసీపీ అభ్యర్ధి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 9 గంటలకు స్థానిక సీతారాముల ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు అంటే ఏప్రిల్ 19వ తేదీన కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబుకు బదులు ఆయన భార్య నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. ఏప్రిల్ 19 అంటే రేపు మద్యాహ్నం 12.33 గంటలకు చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Also read: NEET PG 2024: నీట్ పీజీ 2024 దరఖాస్తులు షురూ, చివరి తేదీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook