కేంద్ర బడ్జెట్ 2023 ఎలా ఉంటుందో అనే అంచనా సర్వత్రా నెలకొంది. 2024 ఎన్నికలకు ముందు వస్తున్న చివరి సంపూర్ణ బడ్జెట్ కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి చాలా ఆశిస్తోంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా దేశపు ఆర్ధిక పరిస్థితి తలకిందులైనట్టే విభజన అనంతర ఏపీ రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెవిన్యూ లోటు ఇంకా అలానే ఉంది. ఈ క్రమంలో ఇవాళ మరి కాస్సేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్. ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. విభజన చట్టంలో తెలిపిన జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో తగిన నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. విభజన అనంతర లోటు పూడ్చేందుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
విభజన జరిగి 9 ఏళ్లు పూర్తవుతున్నా నాడు ఏర్పడిన రెవిన్యూ లోటు ఇంకా అలానే ఉందని ఆర్ధిక శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక సహాయం కింద బడ్జెట్‌లో 24,350 కోట్లు కేటాయించాలని కోరుతోంది. విశాఖపట్నంకు మెట్రో రైలు మంజూరు చేయడంతో పాటు తగిన నిధులు కేటాయించాలని కోరుతోంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను ప్రభుత్వం సమర్పించింది. ఈసారి బడ్జెట్‌లో మెట్రో రైలు ప్రకటనతో పాటు కేంద్ర తగిన నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే విధంగా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల, రాజధాని వికేంద్రీకరణకు నిధులు కేటాయించాలని కోరుతోంది.
అటు పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరుతోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని ప్రోత్సాహకాల్లో భాగంగా పదేళ్లపాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఆదాయపు పన్ను మినహాయింపు, 100 శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌లను ఆశిస్తోంది.
Also read: Budget 2023 Expectations: బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీపై మినహాయింపు ఉంటుందా, ఈఎంఐ తగ్గే అవకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook