ఏపీ మంత్రిమండలి ఇటీవలే పలు పథకాలను ప్రారంభించాలని యోచిస్తూ.. అలాగే పెండింగ్లో ఉన్న పలు పనులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులోని ముఖ్యమైనవి
చంద్రన్న పెళ్లి కానుక - ఏపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకను ఫిబ్రవరిలో ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో బీసీలకు 30 వేలు, ఎస్సీ, ఎస్టీలకు 50 వేలు చప్పున కానుకగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
ఆర్థిక, వ్యవసాయ మంత్రుల కమిటీ - రాష్ట్రంలో పప్పు ధాన్యాల కొరత లేకుండా అమ్మకాలు, కొనుగోళ్లు ఒక క్రమపద్ధతితో జరిగేందుకు ఆర్థిక,వ్యవసాయ, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది
హిజ్రాలకు పింఛన్ సదుపాయం - ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో హిజ్రాల సమస్యలు తీర్చడం కోసం ఒక ప్రత్యేక విధానం తీసుకువచ్చేందుకు ఒక కమిటీని వేయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి హిజ్రాకి నెలకు రూ.1500 ను పింఛనుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయితీ బస్ పాస్ సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు హిజ్రాలకు కూడా అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో 9 కొత్త అర్బన్ మండలాల ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పలుచోట్ల అర్బన్ మండలాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందులో విశాఖలో కొత్తగా 2,3,4 మండలాలు, విజయవాడలో 2,3,4 మండలాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అలాగే గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో కూడా అర్బన్ మండలాలు ఏర్పాటు కానున్నాయి.
గన్నవరంలో సివిల్ జడ్డి కోర్టు ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం క్రిష్ణాజిల్లాలోని గన్నవరం ప్రాంతంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.