శ్రీకాకుళం: ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ( Good news to unemployed ). వైద్య, ఆరోగ్య శాఖలో 9700 ఖాళీలను భర్తీ చేసేందుకు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు ( Jobs in health dept). వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న వారికి ఇది నిజంగానే ఓ గుడ్ న్యూస్. గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రం రిమ్స్‌లో పర్యటించిన సందర్భంగా మంత్రి ఆళ్ల నాని ( Minister Alla Nani ) ఈ ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన సహచర మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావులతో కలిసి మంత్రి ఆళ్ల నాని రిమ్స్ వైద్యులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
( వాడివేడిగా కృష్ణా రివర్ బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య తేలిన లెక్కలు )
శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పటి నుంచో తిష్టవేసిన సమస్యలను ఈ సందర్భంగా అధికారులు, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద రావు మంత్రి ఆళ్లనానికి వివరించారు. ఓవైపు సిబ్బంది కొరత వేధిస్తోంటే మరోవైపు జిల్లాలో ఉన్న సిబ్బంది డెప్యుటేషన్‌పై వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా నుంచి డిప్యూటేషన్ నుంచి నిలిపేయాల్సిందిగా వారు మంత్రిని కోరారు. ( Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి )
వారు చెప్పింది విన్న మంత్రి ఆళ్ల నాని.. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే వైద్య సిబ్బంది కొరతను తీర్చడం కోసం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో 9,700 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..