AP Rains Alert: ఏపీకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఫలితంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.
బంగాళాఖాతంలో తమిళనాడు మీదుగా తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి. అటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా రానున్న 24-48 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 24 గంటల్లో చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, బాపట్ల, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
మరోవైపు తమిళనాడు మీదుగా సముద్రంపై నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత 1-2 డిగ్రీలు తగ్గిపోవచ్చని తెలుస్తోంది. ఏపీలోని పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో పొగమంచు రాత్రి నుంచి ఉదయం వరకూ కమ్మేసి ఉంటుంది. మిచౌంగ్ తుపాను తరువాత చలి ప్రభావం పెరిగింది. పగటి పూట కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటోంది.
పంట చేతికందే సమయంలో మిచౌంగ్ తుపాను కారణంగా వరి పంట చాలావరకూ దెబ్బతింది. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు పొంచి ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Also read: Ind vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, 3 పరుగులకే 2 వికెట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook