APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC).. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్(assistant engineers) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా సివిల్ (Civil), ఈఎన్‌వీ, మెకానికల్ (Mechanical) విభాగాల్లో 190 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్స్
* మొత్తం పోస్టుల సంఖ్య: 190
* విభాగాలు: సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్
Also read: APPSC Recruitment 2021: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్: 151 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
* సర్వీస్‌లు: ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్‌లు, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్.
* అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎల్సీఈ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
* వయసు: 01.07.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
* ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష(Computer Based Written Test) ఆధారంగా ఎంపికచేస్తారు.
* పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్(Objective) విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్(Negative Marks) ఉంటుంది.
* దరఖాస్తు విధానం: ఆన్లైన్(Online) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021
* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021
* వెబ్సైట్: https://psc.ap.gov.in
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook