Chandrababu Case Updates: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో ఇంకా కేసుల భయం తొలగలేదు. పలు కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. స్కిల్ కేసులో సాధారణ బెయిల్ పొంది బయటికొచ్చిన ఆయనకు ఏ కేసులో ఏం జరుగుతుందననే ఆందోళన వెంటాడుతోంది. క్వాష్ పిటీషన్‌పై తీర్పు ఇంకా పెండింగులోనే ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు రిమాండ్ లో ఉన్నారు. తొలుత నాలుగు వారాల మెడికల్ బెయిల్‌పై బయటికొచ్చిన ఆయనకు హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఊపిరిపీల్చుకున్నా ఇంకా పలు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న స్కిల్ కేసు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి తీర్పు రెండు నెలల్నించి పెండింగులో ఉంది. ఈ నెలలో తీర్పు రావచ్చని అంచనా వేస్తున్నారు. స్కిల్ కేసు గురించి బయటెక్కడా మాట్లాడకూడదని హైకోర్టు షరతు విధించింది.
ఇక ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ కూడా ఈ అంశంపై విచారణ జరగనుంది. ఇక మద్యం పాలసీలో అవకతవలకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తదుపరి ఆదేశాలవరకూ అరెస్ట్ చేయవద్దని సూచించిన హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. వాదనలు విన్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మరింత సమయం కోరారు. ఈ కేసు ఇవాళ్టికి వాయిదా పడింది.
ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబుకు ఊరట లభించింది.
Also read: Ind vs SA: సఫారీల గడ్డపై రెండవ టీ20లో టీమ్ ఇండియా పరాజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook