Chandrababu Helicopter Missing: చంద్రబాబు హెలీకాప్టర్ మిస్సింగ్, బాబు సురక్షితమేనా, అసలేం జరిగింది

Chandrababu Helicopter Missing: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ మిస్ అయింది. హెలీకాప్టర్ మిస్ అవడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత, గందరగోళ నెలకొన్నాయి. నిర్దేశిత మార్గం కాకుండా మరో మార్గంలోకి వెళ్లిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2024, 01:27 PM IST
Chandrababu Helicopter Missing: చంద్రబాబు హెలీకాప్టర్ మిస్సింగ్, బాబు సురక్షితమేనా, అసలేం జరిగింది

Chandrababu Helicopter Missing: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఛాపర్ నిర్దేశిత మార్గం కాకుండా మరో మార్గంలోకి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. ఏటీసీ వర్గాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. 

ఏపీ ఎన్నికలు సమీపించడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా పేరిట వివిధ జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నం నుంచి అరకు హెలీకాప్టర్‌లో బయలుదేరారు. విశాఖ నుంచి టేకాఫ్ అయిన కాస్సేపటికే ఆ ఛాపర్ మిస్సయింది. రాంగ్ రూట్‌లో వెళ్తోందని తెలిసిన ఏటీసీ తీవ్రంగా హెచ్చరించింది. పైలట్ వర్సెస్ ఏటీసీ మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే వెనక్కి వచ్చేయాల్సిందిగా ఏటీసీ సూచించడంతో క్షేమంగా హెలీకాప్టర్ విశాఖకు వచ్చేసింది. ఆ తరువాత కాస్సేపటికి అరకు వెళ్లేందుకు సిగ్నల్ లభించడంతో తిరిగి బయలుదేరారు. కాస్సేపటికి అరకులో సురక్షితంగా ల్యాండ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. 

అనుకున్న సమయానికి చంద్రబాబు హెలీకాప్టర్ చేరుకోకపోవజంతో  తెలుగుదేశం వర్గాల్లో, చంద్రబాబు కుటుంబసభ్యుల్లో ఆందోళనన నెలకొంది. రూట్ మిస్సయిందని తెలియగానే మరింత కంగారు పడ్డారు. ఆ తరువాత క్షేమంగా విశాఖ వచ్చేశారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. 

Also read: Chandrababu Naidu: జగన్ అన్న బాణం రివర్స్ గేర్.. వైఎస్సార్సీపీ ఇంటికే: చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News