Nagarjuna VS Konda Surekha: కొత్త చట్టాల ఆధారంగా కొండా సురేఖపై చర్యలు..?.. కీలక వ్యాఖ్యలు చేసిన లాయర్..

Konda surekha controversy: హీరో నాగార్జున ఈ రోజు (మంగళవారం) నాంపల్లి కోర్టులో హజరయ్యారు.  ఈ నేపథ్యంలో ధర్మాసనం ముందు తన వాదనలు విన్పించినట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్యలు కూడా కోర్టుకు వచ్చారు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 8, 2024, 05:33 PM IST
  • కోర్టులో వాడీ వేడీగా వాదనలు..
  • కొండా సురేఖపై ఆగ్రహాం వ్యక్తం చేసిన నాగార్జున
Nagarjuna VS Konda Surekha: కొత్త చట్టాల ఆధారంగా కొండా సురేఖపై చర్యలు..?.. కీలక వ్యాఖ్యలు చేసిన లాయర్..

Nagarjuna vs Konda Surekha controversy nampally court: నాగార్జున నాంపల్లి కోర్టు ఎదుట  హజరయ్యారు. నాగార్జునతో పాటు, అమలు, నాగచైతన్య, ఆయన మేనకోడలు సాక్షి సుప్రియ సైతం హజరయ్యారు.  ఈమేరకు నాగార్జున అక్టోబరు 2 వ తారీఖున... కోండా సురేఖ బాపూఘాట్ వద్ద నాగాచైతన్య, సమంతా డైవర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం గురించి చెప్పారు. గతంలో కేటీఆర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయోద్దంటే... సమంతాను పంపమని కోరినట్లు చెప్పారు. దీనికి సమంతా ఒప్పుకోకపోవడంతోనే తాము.. ఆమెకు డైవర్స్ ఇచ్చినట్లు కూడా వ్యాఖ్యలు చేశారు.

అయితే.. ఇది పూర్తిగా కల్పితమన్నారు.. నాగచైత్యన్య,సమంతాలు వారి ఇష్టప్రకారం డైవర్స్ తీసుకున్నారు. కానీ దీనిపై తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయన్నారు. ఒక మహిళ అయి ఉండి.. సాటి మహిళపై నిరాధర,ఆరోపణలు చేశారన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబమంతా తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పారు. తమ పరువుకు భంగం కల్గిందని కూడా నాగార్జున కోర్టు ఎదుట తమ బాధను చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా కేవలం రాజకీయ దురుద్దేషంతోనే మంత్రి ఈ విధంగా మాట్లాడరంటూ కూడా నాగార్జున కోర్టు వారికి తన వాదనలు విన్పించారు.. అదేవిధంగా ఈ కేసులో.. కోర్టు వారు.. నాగార్జున మేనకోడలైన సాక్షి సుప్రియ స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. 

మంత్రి చేసిన వ్యాఖ్యలు అన్ని  టీడీ మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయని, దీని వల్ల తమ ఫ్యామిలీ క్రెడిబిలిటీ, కుటుంబ గౌరవానికి తీవ్ర భంగం కల్గిందని కూడా కోర్టు  ఎదుట నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున కుటుంబం స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు..తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే.. నాగార్జున తరపు లాయర్ కోర్టులో వాదనల అనంతరం కోర్టు బైట దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు వారు.. కొండా సురేఖకు నోటీసులు జారీచేస్తారన్నారు. అప్పుడు కొండా సురేఖపై వచ్చిన పిటిషన్ పై మీ వాదన, చర్యలు ఎందుకు తీసుకొవద్దో కూడా అడుగుతారని చెప్పారు. అయితే.. కొత్త చట్టాల ప్రకారం కొండా సురేఖపై చర్యలు తీసుకొవచ్చని కూడా లాయర్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ కేసులో.. ఇప్పటికే మంత్రి సారీ చెప్పారని కూడా పలు వాదనలు విన్పిస్తున్నాయని కొందరు ప్రశ్నించారు.

Read more: Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?  

దీనిపై లాయర్ మాట్లాడుతూ...  దీన్ని ఒప్పుకొవడం లేదా తిరస్కరించడం పూర్తిగా పిటిషనర్ అయిన నాగార్జున మీదే ఆధారపడి ఉంటుందని , కోర్టు వారు దీనిలో జోక్యం చేసుకొరని లాయర్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో నాగార్జున ఇప్పటికే పరువునష్టం దావా, క్రిమినల్ చర్యలు తీసుకొవాలని సైతం కొండా సురేఖపై పిటిషన్ లు దాఖలు చేసిన విషయం తెలసిందే. ప్రస్తుతం అక్టోబరు 10 న ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News