ACB Court Rejected Chandrababu Naidu House Remand Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దీంతో హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో చంద్రబాబు జైల్లోనే ఉండనున్నారు. మరో వైపు తమకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరగా.. ఈ పిటిషన్‌పై రేపు కోర్టు తీర్పును ఇవ్వనుంది. మరి చంద్రబాబు కస్టడీకి అనుమతి ఇస్తుందా..? లేదా..? అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతానికి చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
భద్రతాపరంగా చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని న్యాయవాదులు వాదించారు. వయసు రీత్యా ప్రత్యేక వసతులు కావాలని అన్నారు. అయితే జైల్లో పూర్తిస్థాయి భద్రత ఉందని సీఐడీ తరుఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చంద్రబాబు కోసం ప్రత్యేక సదుపాయాలు.. చర్యలు తీసుకుంటోందన్నారు. ఇరువర్గాల వైపు వాదనలు విన్న కోర్టు.. చివరికి సీఐడీ లాయర్ల వాదనకు అంగీకరించింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టేసింది. చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం, పోలీసులు భరోసా ఇచ్చారని తెలిపింది. కస్టడీకి సంబంధించి బుధవారం తీర్పును ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు ఆరోగ్యంపై చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజూ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేలా ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. చంద్రబాబును ప్రత్యేక గదిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు అక్రమమని.. ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్. ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను రేపు హైకోర్టు విచారించనుంది.
Also Read: Ys jagan on Chandrababu Case: చంద్రబాబు అరెస్టు పరిణామాలపై జగన్ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook