Pawan kalyan fan climbs tirumala stairs on her knee: దేశ వ్యాప్తంగా ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రోజు సాయంత్రంతో ఏడు దశల ఎన్నికలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అందరి చూపు జూన్ 4 మీద ఉంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఎన్నికలలో తమ భవితవ్యం ఏంటని కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు ముగియగానే కొందరు నేతలు విదేశాలకు టూర్లకోసం వెళ్లారు. ఇప్పటికే ఏపీ టీడీపీ నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇటీవల నాయకులు తమ ఫారీన్ టూర్ ముగించుకుని తిరిగి ఏపీకి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో చాలా మంది ఎన్నికలలో గెలవాలని దేవుళ్లకు మొక్కులు మొక్కుకుంటున్నారు.
Read more: Marraige Dates: పెళ్లికి రెడీగా ఉన్న వారికి గుడ్ న్యూస్.. జూన్, జులై మాసాల్లోని శుభమూహుర్తాలు ఇవే..
కొందరు కార్యకర్తలు, అభిమానులు తరచుగా తమ వాళ్ల కోసం మొక్కులు మొక్కుకుంటారు. వందల కొబ్బరి కాయలు కొడతామని, కొండకు నడిచివస్తామని కూడా దండం పెట్టుకుంటారు. ఇదంతా మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఒక యువతి తన అభిమాన నేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని మోకాళ్ల మీద తిరుమలలోని మెట్లను ఎక్కింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కింది. ఉండ్రాజవరానికి చెందిన ఆర్ఎంపీ వైద్యురాలు పసుపులేటి దుర్గా రామలక్ష్మికి పవన్ అంటే ఎనలేని అభిమానం. ఈ ఎన్నికల్లో జనసేనాని గెలవాలని ఆమె తిరుమల శ్రీవారిని దండం పెట్టుకున్నారు. జూన్ 4 న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ముందుగానే ఆమె తన మొక్కును తీర్చుకున్నారు. దీనిలో భాగంగా పసుపులేటి దుర్గా రామలక్ష్మి.. మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కినట్లు తెలుస్తోంది. తనకు చిన్న తనం నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చింది.
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన భారీ మెజారిటీతో గెలవాలని, ఆ వెంకన్నఆశీస్సులతో పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తారని పసుపులేటి దుర్గా రామలక్ష్మి దీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రజలు తమకే పట్టం కడతారని చెబుతున్నారు. మరోవైపు కూటమి నేతలు మాత్రం.. ప్రజలు జగన్ పాలన పట్ల విరక్తితో ఉన్నారని, ఈసారి తమను విజయం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ షర్మిల కూడా తమకు ఈసారి ఎన్నికల్లో మంచి మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు దేవుడు ఎవర్ని ఆశీర్వదించాడో మాత్రం తెలుసుకొవడానికి జూన్ 4 వరకు వేచీ చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter