Panchayat officials notice to ali: కమెడియాన్ అలీకి అనుకొని ట్విస్ట్ ఎదురైంది. ఆయనకు వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం ఎక్ మామిడి గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల చేపట్టిన ఫామ్ హౌస్ కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తొంది. సాధారణంగా సినిమా నటులు, రియల్ ఎస్టేట్ నిర్వహణ దారులు, టెకీలు గ్రామాల్లో భూములను కొనుగోలు చేస్తుంటారు. విదేశాలలో కూడా ఉద్యోగాలు చేసే వారు.. ఇటీవల కాలంలో భూములపై ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నారు.
వ్యవసాయ భూముల్ని భారీగా కొనుగోలు చేస్తుంటారు. అదే విధంగా.. ఈ భూముల మీద తమ డబ్బుల్ని ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. ఇదంతా మనం తరచుగా చూస్తుంటాం. అయితే.. వీరి కొనుగోలు చేసిన వాటికి సరైన విధంగా అనుమతులు లేకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అచ్చం ఇలాంటి పరిస్థితుల్ని కామెడియన్ అలీ ఎదుర్కొన్నట్లు తెలుస్తొంది. ఆయన వికారాబాద్ జిల్లా లోని ఎక్ మామిడి ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఆ భూమిని వ్యవసాయ భూమిగాను డెవలప్ చేస్తున్నారంట.
ఈ నేపథ్యంలో.. ఆ భూమిలో ఇటీవల అలీ రూల్స్ కు విరుద్దంగా.. ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అయితే.. పంచాయతీ రాజ్ రూల్స్ ప్రకారం.. వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడితే.. ఆ పంచాయతీ పరిధివారి అనుమతులు తీసుకొవాలి. కానీ అలీ అవేం పట్టించుకొకుండా.. నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తొంది.
Read more: Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?
ముఖ్యంగా.. అలీ.. ఎక్ మామిడి రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 345 లోని ఫామ్ హౌస్ విషయంలో చేపట్టిన నిర్మాణంపై.. గతంలో కూడా .. అధికారులు నోటీసులు జారీచేశారంట. కానీ ఆయన దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి తాజాగా.. మళ్లీ నోటీసులు జారీ చేయడం వార్తలలో నిలిచింది. ఈసారి తగిన విధంగా రెస్పాండ్ కాకుంటే... పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.