Nara Lokesh US Tour: ఐదేళ్లుగా కొత్త పరిశ్రమల పలకరింపు లేని ఆంధ్రప్రదేశ్‌కు భారీ శుభవార్త త్వరలో వినిపించనున్నట్లు కనిపిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుండడంతో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంత్రిగా మరోసారి ఎన్నికైన నారా లోకేశ్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ఆయన సమవేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో మైక్రోసాఫ్ట్ కంపెనీని నెలకొల్పాలని.. విస్తరించాలని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చొరవతో ఆ పరిశ్రమ ఏపీకి రానుందని ప్రచారం జరుగుతోంది.
Also Read: Pawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్ తాజాగా ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్లకు ఏపీలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను వివరించారు. ఏపీతో సత్య నాదెళ్ల కుటుంబానికి అనుబంధాన్ని కూడా లోకేశ్ గుర్తు చేశారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేసినట్లు వెల్లడించారు.
Also Read: APSRTC Driver: నారా లోకేశ్ చొరవతో ఏపీఎస్‌ఆర్టీసీ రీల్స్ డ్రైవర్ విధుల్లోకి..
ఏపీని సాంకేతిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నామని.. ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని కోరారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్‌లకు అనువుగా ఉందని వివరించారు.
క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల అమలు, డేటా అనలిటిక్స్ కోసం ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల అభివృద్ధి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారం కావాలని లోకేశ్ కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా చేస్తామని చెప్పారు. ఏపీలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారని లోకేశ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ?.. ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్ తొలి విజయం