Pawan Kalyan: రానున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా బరిలో దిగుతున్నాయి. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ అభ్యర్ధుల్ని చాలావరకూ ప్రకటించగా ఇవాళ జనసేనాని కూడా తన పోటీ విషయమై స్పష్టత ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది ప్రకటించారు.
ఏపీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. అధికార పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. బీజేపీ-తెలుగుదేశం పార్టీలతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ తానెక్కడ్నించి పోటీ చేసేది చెప్పలేకపోయారు. గాజువాక, భీమవరం, పిఠాపురం, తాడేపల్లిగూడెం ఇలా చాలా పేర్లే విన్పించాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి ఎంపీగా పోటీ చేస్తారనే వాదన గట్టిగా విన్పించింది. ఎట్టకేలకు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశ్యం ప్రస్తుతానికి లేదని, ఆ పరిస్థితి వస్తే పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానన్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల్నించి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండుచోట్లా ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన గెలిచిన ఒకే ఒక స్థానం రాజోలు నుంచి రాపాక వరప్రసాద్. ఆ తరువాత జనసేనను వీడి వైసీపీలో కలిసిపోయారు.
అందుకే పవన్ కళ్యాణ్ ఈసారి గాజువాక, భీమవరం కాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ తరపున వంగా గీత బరిలో ఉన్నారు. నియోజకవర్గం కాపు సామాజికవర్గం ప్రాబల్యం కలిగిందే అయినా వంగా గీత అదే సామాజికవర్గానికి చెందిన స్థానిక నేత కావడంతో పవన్ కళ్యాణ్‌కు అంత సులభం కాకపోవచ్చనే వాదన విన్పిస్తోంది. దానికితోడు ముద్రగడ పద్మనాభం వంటి నేతలు వైసీపీలో చేరనుండటంతో అధికార పార్టీకు మరింత బలం చేకూరవచ్చు. ఇక పిఠాపురం నుంచి టికెట్ ఆశిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఏ మేరకు సహకరిస్తారనేది సందేహమే.
Also read: Telugudesam 2nd List: 34 మందితో తెలుగుదేశం రెండో జాబితా విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook