Janasena leader pawan kalyan injured: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి సభలో పాల్గొనేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాలుకు ఏదో కట్టుకట్టి ఉండటంను ఆయన అభిమానులు, జనసైనికులు,నేతలు గమనించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ అభిమాన నేత కాలికి గాయం చూసి, అనేక మంది కంగారు పడిపోతున్నారు. తమ నేతకు ఏమైందో అంటూ ఆరాలు తీస్తున్నారు. ఆంజనేయ స్వామి అనుగ్రహాం వల్ల ఆయనకు ఏంకాకుడంటూ కొందరు ప్రత్యేకంగా ప్రార్థనలుకూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో ఎలాగైన అధికారం సాధించాలనే టార్గెట్ గా టీడీపీ, జనసేన,బీజేపీలు పొత్తులు పెట్టుకున్నాయి.
సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయంమాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో అన్ని పార్టీల నాయకులు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆయన అభిమానులు ఎక్కడ సభ జరిగిన పెద్ద సంఖ్యలో తరిలివస్తున్నారు. ఈసారి తమ అభిమాన హీరోను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు జనసైనికులు చెప్తున్నారు. ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఏపీలో ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. అంతకు ముందు అమిత్ షాకూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఏమాత్రం విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారాహి సభల్లో పాల్గొంటు ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపరుస్తున్నారు. అయితే.. కొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడటం వల్ల ఆయన కాలికీ గాయమై ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.
Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?
కాలి వేలికి కట్టుతోనే నేడు తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేనాని కాలికి గాయం కావడంతో ఇటు కూటమి నేతలు, ఆయన పవన్ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.ఇక ఏపీలో ప్రచారం పీక్స్ కు చేరింది. ఈసారి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ, టీడీపీ, జనసేనలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్ తాను తీసుకొచ్చిన డెవలప్ మెంట్ స్కీమ్ లు, లబ్ధి పొందిన విధానంవివరిస్తు తనకుమరోసారి పట్టంకట్టాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైతం దివంగతనేత రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. తనను గెలిపిస్తే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తొలిసంతకం ఏపీకి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే అంశాలపై పెట్టిస్తానంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter