Pawan Kalyan Comments: అన్నయ్య పార్టీపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ నాయకుల్లో కమిట్మెంట్ లేదు!

Pawan Kalyan Comments on Prajarajyam Party Leaders: ప్రజారాజ్యం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జనసేనాన్ పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చర్చకు దారితీస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2023, 09:42 AM IST
Pawan Kalyan Comments: అన్నయ్య పార్టీపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ నాయకుల్లో కమిట్మెంట్ లేదు!

Pawan Kalyan Sensational Comments on Praja Rajyam Party Leaders: 2009 ఎన్నికల ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో ఓ సంచలనం. 18 స్థానాల్ని గెల్చుకుని ఆ తరువాత కొద్దికాలానికి కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఈ విలీన ప్రక్రియపై మెగాస్టార్ సోదరుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. పి గన్నవరం నియోజవకర్గంలో పార్టీ నేతలతో సమావేశమైన పవన్ పలు అంశాలపై చర్చించారు. ప్రజారాజ్యం పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న పార్టీ కంటే తన పార్టీ నేతలే గొప్పని పరోక్షంగా చెప్పారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నాయకులకు కమిట్మెంట్ లేదని చెప్పారు. ఇప్పుడు జనసేన నాయకులకు ఉన్న కమిట్మెంట్ అప్పుడు ఉండి ఉంటే..పార్టీని విలీనం చేయాల్సి వచ్చేది కాదన్నారు. అంటే పవన్ దృష్టిలో కమిట్మెంట్ లేనిది ఎవరికి, ప్రజారాజ్యం స్థానిక నేతలకా లేదా అన్న చిరంజీవిగా అనేది పవన్ కళ్యాణే చెప్పాలి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.

Also Read: Pawan Kalyan: మొన్న జూనియర్, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే యత్నాల్లో పవన్

ఎన్నికల్లో గెలిచినవారికి కమిట్మెంట్ ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. జవాబుదారీతనం లేని నాయకులంటే తనకు ఆసక్తి ఉండదన్నారు. 2014లో చీకట్లో బయలుదేరితే..2019లో రాజోలు రూపంలో చిరుదీపం అందిందన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామనుకుంటే ఉన్న ఒక్క నాయకుడు వెళ్లిపోయాడన్నారు. ఇక నుంచి తాను గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి, సమయం పెడతానన్నారు. గన్నవరం, రాజోలు నియోజకవర్గాలపై వ్యక్తిగతంగా సమీక్షిస్తానన్నారు. 

2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో తనకు 18 శాతం ఓట్లు పడ్డాయని అంటే 20 లక్షలమంది ఓట్లేశారని గుర్తు చేశారు. గెలిచిన ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోయినా ప్రజలు, జనసైనికులు అండగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. పాలించే నాయకుడు నిజాయితీపరుడైతే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్

Also Read: Kuppam 2024: కుప్పంలో ఏం జరుగుతోంది, వైనాట్ కుప్పం సాధ్యమయ్యేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News