Kandukuru TDP Incharge Inturi Nageshwar Rao Arrested: ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాదులో తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనని కందుకూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూరు నుంచి హైదరాబాద్ వచ్చిన అక్కడి పోలీసులు కందుకూరు ఘటనలో నాగేశ్వరరావును చేసినట్లు సమాచారం.
రెండు కార్లలో వచ్చి అరెస్టు చేసిన కందుకూరు పోలీసులు ఆయనను కందుకూరు తీసుకు వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ అంశం మీద అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో ఉండగా ఒక రోడ్ షో ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కందుకూరులో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన ఈ రోడ్ షోలో తొక్కిసలాట జరగడంతో పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయి ఎనిమిది మంది మృత్యువాత పడగా పది మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.
చనిపోయిన వారికి తెలుగుదేశం పార్టీ తరపున ఒక్కొక్కరికి పాతిక లక్షల దాకా ఆర్థిక సహాయం చేశారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంతమేర ఆర్థిక సహాయం చేసింది. అయితే ఈ మరణాలు సంభవించడానికి ఇరుకు సందుల్లో సభలో ఏర్పాటు చేయడమే కారణమని ముందు నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ ఏర్పాటు చేసింది కందుకూరు టిడిపి ఇన్చార్జిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు కాబట్టి ఎనిమిది చావులకు ఆయనను బాధ్యుడిని చేస్తూ ఆయనని అదుపులోకి తీసుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.
డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది, కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడకూడదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటివి ఉపేక్షిస్తే మున్ముందు ఎన్నో చావులు చూడాల్సి ఉంటుందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇక ఇప్పటికే జీవో నెంబర్ ఒకటి జారీ చేస్తూ సభలు గానీ సమావేశాలు కానీ నిర్వహించాలి అనుకుంటే ముందుగా ప్రభుత్వానికి అనుమతుల కోసం దాఖలు చేసుకుని ప్రభుత్వ అధికారులు అనుమతి ఇస్తేనే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోమని చెబుతోంది. రోడ్ షోల విషయంలో కూడా కఠినంగా నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం సూచించింది.
Also Read: Varasudu Preponed: ఒక రోజు ముందుకు వారసుడు సినిమా.. చివరి నిముషంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్!
Also Read: Waltair Veerayya Pre Release Event: 'వాల్తేరు వీరయ్య' యూనిట్ కు షాక్.. ఆర్కే బీచ్లో అనుమతి లేదంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook