locals carry pregnant woman for 10 kms in AP: అమరావతి: ఆధునిక ప్రపంచంలో మానవులకు అన్నీ చేరువయ్యాయి. విద్యా, వైద్యం, రవాణా, వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా అన్ని సౌకర్యాలు కొన్నిచోట్లకే దరిచేరాయి.. ఇంకా ఈ సౌకర్యాలు లేని అనేక ప్రాంతాలు.. అలానే సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన వైద్యం అందక చాలా మంది గిరిజనులు ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు. అటవీ ప్రాంతాల్లో అయితే కొనఊపిరితో ఉన్నవారు ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పరిస్థితుల్లో గర్భిణిలు (Pregnant woman carried) ఉంటే.. వారు పడే అవస్థలు వర్ణనాతీతం.. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఓ గర్భిణి ప్రసవ వేదన కంటే.. ఆసుపత్రికి చేరేందుకు ఎక్కువ కష్టాలను అనుభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH A pregnant woman was carried on a makeshift palanquin for over 10-km due to absence of proper roads in Daraparti panchayat of S Kota Mandal in Vizianagaram, Andhra Pradesh. (09.09.2020) pic.twitter.com/a2Gls8opwt
— ANI (@ANI) September 9, 2020
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని విజయనగరం జిల్లాలోని ఎస్ కోట మండలం దారపార్తి పంచాయతీ నుంచి ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు నానా కష్టాలు పడ్డారు. జెట్టికట్టి గర్భిణీని దానిలో ఉంచి 10 కిలోమీటర్లకు పైగా మోసుకుంటూ తీసుకెళ్లారు. గుంతల రోడ్డు వెంట అటవీ ప్రాంతంలో ఆమెను తీసుకెళ్లేందుకు మహిళలు, యువకులు అష్టకష్టాలు పడ్డారు. Also read: #Watch: పురిటినొప్పులను మించిన కష్టం