Janasena Candidates List: టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. 175 స్థానాల్లో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు. 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్.. మిగిలిన స్థానాలకు మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. పాత, కొత్త కలయికతో చంద్రబాబు నాయుడు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తే మిగిలిన స్థానాల్లో కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటనతో టీడీపీలో అసంతృప్తి జ్వలాలు రగులుతున్నాయి. పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.
Also Read: అమెజాన్ లో ఐఫోన్ 15 ఆర్డర్ చేశాడు.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు..
ఇక జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. పార్టీ స్థాపించి పదేళ్లవుతున్నా.. కేవలం 24 స్థానాల్లో పోటీ చేయడం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. కూటమిలో పవన్ కళ్యాణ్ కావాల్సినన్ని సీట్లు కూడా దక్కించులేకపోయారని.. ఇలాగైతే ఆయన ఎప్పటికీ సీఎం అవుతున్నారని ప్రశ్నించారు. 24 MLA అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
సీట్ల ప్రకటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తమకు 10 సీట్లు వచ్చినా.. ఇప్పుడు పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడిగేవాళ్లమన్నారు. తక్కువస్థానాల్లో పోటీ చేస్తున్నా.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలన్నారు. పొత్తుల్లో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాస్త తగ్గాల్సి వచ్చిందన్నారు. 24 సీట్లే అనుకోవద్దని.. మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలోని స్థానాలను కలుపుకుంటే జనసేన 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్కన్నారు. జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్‌ఫర్ అయితేనే కూటమి అధికారంలోకి వస్తుందని.. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు అడుగులు వేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తారని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మిగిలిన స్థానాల్లో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలన్నారు. అయితే తాను ఎక్కడ పోటీ చేసే స్థానంపై ఇంకా క్లారటీ ఇవ్వలేదు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter