Chandrababu-Pawan Meet: చంద్రబాబు-పవన్ భేటీ, మేనిఫెస్టోపై చర్చ, మరోసారి పోటీ అక్కడి నుంచే

Chandrababu-Pawan Meet: ఏపీలో రాజకీయవేడి పెరుగుతోంది. ఎన్నికల సమరానికి మరో ఐదారు నెలలో మిగిలింది. తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా చర్చలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు-వపన్ కళ్యాణ్ మధ్య కీలకాంశాలపై నిన్న చర్చలు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2023, 07:49 AM IST
Chandrababu-Pawan Meet: చంద్రబాబు-పవన్ భేటీ, మేనిఫెస్టోపై చర్చ, మరోసారి పోటీ అక్కడి నుంచే

Chandrababu-Pawan Meet: రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పొడిచిన టీడీపీ-జనసేన పొత్తు ముందుకు సాగుతోంది. మెడికల్ బెయిల్‌తో విడుదలైన చంద్రబాబును జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పొత్తులో భాగంగా కీలకాంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.

ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో పరామర్శించిన తరువాత అదే జైలు ప్రాంగణం నుంచి టీడీపీతో కలిసి పోటీ చేయనున్నామని తొలిసారిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత టీడీపీ-జనసేన యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఇప్పుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పరామర్శించిన పవన్ కళ్యాణ్ కీలకాంశాలపై చర్చించారు. ముఖ్యంగా రెండు అంశాలపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో, ఇతర కార్యక్రమాలపై చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలు మంతనాలు సాగాయి. టీడీపీ గతంలో ప్రకటించిన ఆరు హామీలకు తోడు ఇతర హామీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకై చర్చించుకున్నారు. 

మరోవైపు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల్నించి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. భీమవరంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దాదాపు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈసారి పొత్తులో భాగంగా అదే భీమవరం నుంచి పోటీ చేస్తే ఈసారి విజయం పక్కా అనే భావనలో ఉన్నారు. ఇదే విషయంపై చంద్రబాబుతో భేటీ సందర్భంగా చర్చించారని, భీమవరం పవన్‌కు వదిలేసేందుకు చంద్రబాబు సమ్మతించినట్టు సమాచారం. 

ఇవాళ చంద్రబాబుతో భేటీకు ముందే రాజమండ్రిలో జనసేన-టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో, క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు కలిపి చేయాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబుతో ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ ఇవే అంశాలపై మరోసారి చర్చించారు. 

Also read: Caste Census: ఏపీలో నవంబర్ 20 నుంచి కుల గణన ప్రారంభం, ఎలా జరుగుతుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News