PM Modi Vizag Tour: ప్రధాని నరేంద్ర మోదీకి INS Dega లో ఏపీ సి.ఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ ఘన స్వాగతం పలికారు. వర్షం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం 30 నిముషాలు ఆలస్యంగా విశాఖకు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికిన బీజేపి నేతలు, కార్యకర్తలు.. మోదీ రోడ్ షోలో బిజెపి శ్రేణులు మోదీ.. మోదీ.. నినాదాలతో హోరెత్తించారు. భారత్ మాతా కీ జై అంటూ బిజెపి శ్రేణులు చేసిన నినాదాలతో విశాఖ తీరం మార్మోగిపోయింది.
INS డేగ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కాగా.. బీజేపీ నేతలు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ డేగ నుంచి మారుతి జంక్షన్, నేవల్ డాక్‌యార్డ్ మీదుగా ఐఎన్ఎల్ చోళకు చేరుకున్నారు. భద్రతా కారణాలరీత్యా రోడ్ షోలో పాల్గొనేందుకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తమకు పాసులు ఉన్నప్పటికీ యాత్రలో పాల్గొనడకుండా అడ్డుకోవడం ఏంటంటూ బీజేపి నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | People turn out in large numbers to greet PM Modi in Vishakhapatnam, Andhra Pradesh
PM will lay the foundation stone of projects worth over Rs 10,500 cr in Visakhapatnam tomorrow. pic.twitter.com/GuvXGzxE79
— ANI (@ANI) November 11, 2022
ప్రధాని నరేంద్రమోదీ ఐఎన్ఎస్ చోళకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే.. ప్రధాని మోదీతో ఐఎన్ఎస్ చోళలో పవన్ కళ్యాణ్ భేటి జరగనుంది. ఐఎన్ఎస్ డేగ వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికిన అనంతరం గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్ నోవోటెల్ హోటల్‌కి చేరుకోగా.. సీఎం వైఎస్ జగన్ పోర్ట్ గెస్ట్ హౌస్‌కి వెళ్లారు.
Also Read : Modi Visakha Tour: విశాఖలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook