RRR కు బంపరాఫర్.. జగన్ కు దిమ్మదిరిగేలా బాబు వ్యూహం..

AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 13, 2024, 10:26 AM IST
RRR కు బంపరాఫర్.. జగన్ కు దిమ్మదిరిగేలా బాబు వ్యూహం..

AP Assembly Deputy Speaker: వివాదాస్పద ఉండి తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు  కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్ర ప్రదేవ్ శాసన ఉప సభాపతి కానున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఒకటి రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామ కృష్ణంరాజు ఎన్నిక కావడం లాంఛనమే అని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైయస్ఆర్సీపీ  తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే అప్పటి జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించారు. మరోవైపు జగన్ రఘురామకృష్ణంరాజు రాజద్రోహం  కేసులో జైలు పాలు చేసిన ఆయన ఇబ్బందులు పాలు చేసిన సంగతి తెలిసిందే కదా.  

కేంద్రంలోని పెద్దల సన్నిహిత సంబందాలు ఉన్నాయి రఘురామ కృష్ణంరాజుకు.  ఆయన్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం హస్తినకే  పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో కంప్లైంట్ చేసారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా చేర్చారు.

మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటానికి నడుం బిగించారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి కూటమి తరుపు నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని కొంత అతి చేసారు. కూటమిలో ఎవరికీ ఆ సీటు వస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నర్సాపురం బీజేపీకి కేటాయించింది. కానీ బీజేపీ అప్పటికే స్థానికంగా బలంగా ఉన్న భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. ఆయన ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యారు. నర్సాపురం ఎంపీ సీటు దక్కకపోవడంతో ఉండి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇపుడు అసెంబ్లీలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. ఈ పదవి కూడా క్యాబినేట్ ర్యాంక్ తో సమానం. మరి టీడీపీ ఆఫర్ చేసిన ఈ పదవిని ఈ వివాదాస్పద నేత చేపడతారా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News