AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చి వేరే వారికి అవకాశం కల్పించింది. నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ మార్చింది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అయితే అనూహ్యంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ కోటాలో టికెట్ లభించడం గమనార్హం.
Raghurama Krishnam Raju Latest News: ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆయన టికెట్‌ను చంద్రబాబు నాయుడు కన్ఫార్మ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్థానంలో RRR ను అభ్యర్థిగా ప్రకటించారు.
AP Assembly Elections 2024: తనకు ఎంపీగా పోటీ చేయాలని ఆశ ఉందని.. ప్రజలు తనను అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను స్పీకర్‌గా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. తాను పోటీ చేయడంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, (YS Jagan Mohan Reddy) ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది.
YSRCP MP Raghurama Krishnam Raju: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ గతంలో లేఖలు రాసిన రఘురామ కృష్ణ రాజు.. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాల (Pelli Kanuka scheme, Shadi mubarak scheme) కింద అందించే ఆర్థిక సహాయం పెంపుపై ఇచ్చిన హామీ గురించి తన లేఖలో ప్రస్తావించారు.
Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.