APPSC Group 2 Mains Exams: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలు తీవ్ర గందరగోళానికి దారి తీసింది. నిరుద్యోగులు వాయిదా కోసం పట్టుబట్టగా ప్రభుత్వం తీవ్ర చర్చలు జరిపింది. న్యాయ సలహా తీసుకుని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఏపీపీఎస్సీ బేఖాతరు చేసింది. యథావిధిగా గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించడం సంచలనం రేపింది. స్వయంగా సీఎం ఆదేశించినా కూడా కమిషన్ వాయిదా వేయకపోవడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: YSRCP MLAs Entry Assembly: వైఎస్ జగన్ యూటర్న్..! అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం
గ్రూప్2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని రోజులు పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఏపీపీఎస్సీ ఇంతవరకు స్పందించలేదు. పరీక్ష వాయిదా పడిందని విస్తృతంగా ప్రచారం జరగడంతో ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన చేసింది. 23వ తేదీన జరిగే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించింది. పరీక్షలు వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది.
Also Read: APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా
సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచింది. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఏర్పాట్లు ఇలా..
ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనుండగా.. 92 వేల 250 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.