PM Modi Tour: ఏపీలో జనసేన-తెలుగుదేశం కూటమిలో బీజేపీ చేరిన తరువాత మూడు పార్టీలు సంయుక్తంగా బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని మోదీ రెండ్రోజుల ఏపీ పర్యటన ఈ సందర్భంగా ఖరారైంది.
ఏపీలో 2014 నాటి పొత్తులు రిపీట్ అవుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీలు మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాయి. నాటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా పూర్తిగా మద్దతిచ్చింది. కానీ ఈసారి జనసేన కూడా పోటీ చేస్తోంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంటే, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక బీజేపీ మాత్రం 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో బరిలో దిగనుంది.
మూడు పార్టీల పొత్తు కుదిరాక ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన ఖరారైంది. మూడు పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి ఎన్నికల పర్యటనకే ప్రధాని మోదీ హాజరుకానుండటం ఆసక్తి రేపుతోంది. ఈ నెల 15 వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రోడ్ షోలో పాల్గొంటారు. తరువాత ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరిగే మూడు పార్టీల ఉమ్మడి సభలో పాల్గొంటారు.
అంటే చిలకలూరి పేట సభ ద్వారా ప్రదాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కన్పించనున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 ఎన్నికల ప్రచారంలో ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. తిరిగి పదేళ్ల తరువాత ఈ దృశ్యం కన్పించనుంది.
Also read: Social Media Harassment: సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్, తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter