RGV: ఎవడికి భయపడ.. ఎక్కడికి పారిపోలే.. ఆర్జీవి హాట్ కామెంట్స్ వైరల్..

RGV: తన కోసం ఏపీ పోలీసుల గాలింపు, నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ (Ram Gopal Varma) తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదన్నారు. ఇంతోటి దానికి వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 27, 2024, 09:45 AM IST
RGV: ఎవడికి భయపడ..  ఎక్కడికి పారిపోలే.. ఆర్జీవి హాట్ కామెంట్స్ వైరల్..

Ram Gopal Varma: ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో తమపై అసభ్యకరమైన పోస్టులతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోసాని, శ్రీ రెడ్డితో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ బుక్ అయ్యాయి.వైసీపీ నేతలు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం  తమపై కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇకపై భవిష్యత్తులో ఎవరు హద్దులు మీరకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలతో పాటు వివిధ వ్యక్తులపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ..గతంలో  తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని కాస్త వ్యంగ్యంగా ప్రశ్నించారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదన్నారు.  తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నానని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు.ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా వివాదం అయ్యింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లతో పాటు లోకేష్ లపై అనుచితంగా సీన్లు తీయడమే కాకుండా సినిమాపై ప్రశ్నించిన వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు.

అటు సోషల్ మీడియాలోనూ అసభ్యంగా, అవమానకరంగానూ పోస్టులు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆర్జీవీని కలిసి నోటీసులు అందజేశారు. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News