YS Sharmila: తిరుమల తిరుపతి లడ్డూపై ఏర్పడిన వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన సూచనలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుపతి లడ్డూను కూడా రాజకీయం చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం చేసిన సూచనలు బాబు, మోదీకి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
Also Read: Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం చేసిన సూచనలపై వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'సుప్రీంకోర్టు చేసిన సూచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టులాంటిది. కేంద్రం దర్యాప్తు చేయాలని, సీబీఐతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వాదిస్తోంది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన మా డిమాండ్‌కు బలం చేకూరినట్లయ్యింది' అని షర్మిల పేర్కొన్నారు.
'సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా విచారణకు ఉపయోగం లేదు. సీబీఐకి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయి. కల్తీ ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? పాల్పడ్డ దొంగలు ఎవరు? తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? ఎన్‌డీడీబీ నివేదికను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది' అని షర్మిల తెలిపారు.
నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 'కూటమి సర్కారును మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే.. మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి' అని షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన @BJP4India కేంద్ర,రాష్ట్ర @YSRCParty @iTDP_Official @JanaSenaParty ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది. కేంద్రం దర్యాప్తు చేయాలని, CBI తో విచారణ చేపట్టాలని @INC_Andhra కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోంది. ఇవ్వాళ సుప్రీం…
— YS Sharmila (@realyssharmila) September 30, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.