Sarada Peetham: సీఎం చంద్రబాబు దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌ను వీడిన స్వామిజీ? ఎవరో తెలుసా?

Swaroopanandendra Swamy Vacats Andhra Pradesh: సీఎం చంద్రబాబు దెబ్బకు దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఓ స్వామిజీ ఆంధ్రప్రదేశ్‌ను వీడారు. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన స్వామిజీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేక హిమాలయాలకు వెళ్లారని సమాచారం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 27, 2024, 08:53 PM IST
Sarada Peetham: సీఎం చంద్రబాబు దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌ను వీడిన స్వామిజీ? ఎవరో తెలుసా?

Swaroopanandendra Swamy: ఆంధ్రప్రదేశ్‌లో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన అధికారులు, నాయకులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుందమని స్పష్టమవుతోంది. నాయకులే కాదు సాధారణ కార్యకర్తలపై కూడా తీవ్ర చర్యలు తీసుకుంటున్న పరిణామాలు చూస్తున్నాం. తాజాగా సీఎం చంద్రబాబు దెబ్బకు దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన స్వామిజీ ఆంధ్రప్రదేశ్‌ను వీడారు. గత ప్రభుత్వంలో విశిష్ట ప్రాధాన్యం పొందిన స్వామిజీ మారిన రాజకీయాల నేపథ్యంలో ఆయన ఏపీని వదిలి వెళ్లిపోయారు. ఎవరా స్వామిజీ..? ఏం జరిగింది? చంద్రబాబు ఏం చేశారు? అనేది తెలుసుకుందాం.

ఇది చదవండి: YS Sharmila: అదానీ ఒప్పందంపై జగన్‌ తన బిడ్డలపై ప్రమాణం చేయాలి.. వైఎస్‌ జగన్‌కు షర్మిల ఛాలెంజ్‌!

గతం ఘనం.. వర్తమానం కష్టం
ఆంధ్రప్రదేశ్‌లో అనేక పీఠాలు ఉన్నాయి. వాటిలో విశాఖపట్టణంలోని శారద పీఠం ఒకటి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఈ మఠాన్ని సందర్శిస్తుంటారు. శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి నేతృత్వంలో కొనసాగుతోంది. నిత్యం వీఐపీల సేవలో ఈ మఠం తరిస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శారదా పీఠానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆ క్రమంలోనే విశాఖపట్టణంలో రూ.300 కోట్ల విలువ చేసే భూమిని రూ.15 లక్షలకే జగన్‌ ప్రభుత్వం అప్పగించింది. జగన్‌ ప్రభుత్వం స్వామికి వై కేటగిరి భద్రత, ఉత్తరాధికారి స్వామికి ఒక గన్‌మెన్‌ను నియమించారు. జగన్‌ పాలనలో రాజగురువుగా స్వరూపానందేంద్ర వెలిగారు. పీఠం ఉత్తరాధికి కాలం గిర్రున తిరగడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. జగన్‌ సీఎం పదవి నుంచి దిగిపోవడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో శారదా పీఠానికి గడ్డుకాలం ఎదురైంది.

ఇది చదవండి: Tirumala: అల్లరల్లరి అవుతున్న తిరుమల.. ప్రాంక్‌ వీడియోలకు అడ్డాగా పవిత్ర క్షేత్రం

అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ ముందరేసుకుని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్టణంలోని స్వరూపానందేంద్ర స్వామి శారదా పీఠంపై కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారు. జగన్‌ ప్రభుత్వం కేటాయించిన విలువైన భూమిని సీఎం చంద్రబాబు రద్దు చేశారు. జగన్‌ ప్రభుత్వం కల్పించిన వై కేటగిరి భద్రతను తొలగించారు. వన్‌ ప్లస్‌ వన్‌ పోలీస్‌ బందోబస్తుకు పరిమితం చేశారు. పీఠానికి సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

వేధింపులు.. కక్షసాధింపు చర్యల నుంచి తప్పుకునేందుకు స్వరూపానందేంద్ర స్వామి ఏపీని వీడాలని నిర్ణయించుకున్నారు. రిషికేశ్‌లో కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు కల్పిస్తున్న వన్‌ ప్లస్‌ వన్‌ భద్రతను ఉపసంహరించుకోవాలని శారదా పీఠం మేనేజర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ గురు రిషికేశ్‌లో కొంతకాలం తపస్సు చేయనున్న కారణంగా భద్రత తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనతో స్వరూపానందేంద్ర స్వామి ఏపీని వీడనున్నారని స్పష్టమవుతోంది. తెలంగాణలో ఉండాలని చూసినా కూడా ఇక్కడ చంద్రబాబు శిష్యుడు సీఎంగా ఉండడంతో ఇక్కడ సురక్షితం కాదని భావించి మంచుకొండలకు వెళ్లారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు దెబ్బకు స్వామిజీ ఏపీని వదిలి పారిపోయాడని కూటమి నాయకులు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News