Chandrababu Delhi Tour: బీజేపీతో పొత్తుపై ఇవాళ క్లారిటీ వస్తుందా, ఢిల్లీకు చంద్రబాబు

Chandrababu Delhi Tour: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ప్రతిపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ వెళనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2024, 12:04 PM IST
Chandrababu Delhi Tour: బీజేపీతో పొత్తుపై ఇవాళ క్లారిటీ వస్తుందా, ఢిల్లీకు చంద్రబాబు

Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగనుంది. అటు తెలుగుదేశం-జనసేన పార్టీలు ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డాయి. ఇక మూడోపార్టీగా బీజేపీ చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ కేటాయించగా బీజేపీకు ఎన్ని కేటాయిస్తారనేది ఇంకా తేలలేదు. 

అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లోపలే విడుదల కానుంది. రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేనల మధ్య పొత్తు కుదిరింది. ఇక బీజేపీ కూటమిలో చేరే విషయంపై ఇంకా సందిగ్దత నెలకొంది. ఇటీవలే తెలుగుదేశం అదినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారు. అయినా బీజేపీ ఇప్పటికీ పొత్తు విషయంపై ప్రకటన చేయకుండా నాన్చుతోంది. మరోవైపు సమయం మించిపోతోంది. ఎందుకంటే టీడీపీ ఇప్పటి వరకూ 94 సీట్లే ప్రకటించింది. 24 సీట్లను జనసేనకు కేటాయించింది. అంటే 175 సీట్లలో 118 మినహాయిస్తే మిగిలిన 57 సీట్లలో బీజేపీకు కేటాయించే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను బట్టి తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. 

అందుకే పొత్తుల వ్యవహారంలో స్పష్టత కోసం చంద్రబాబు మరోసారి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ పెద్దలు పురంధరేశ్వరి, సోము వీర్రాజులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు నిన్న అంటే బుధవారం చంద్రబాబు..పవన్ కళ్యాణ్ దాదాపు గంటన్నర సమావేశమయ్యారు. పొత్తు విషయంలో చర్చలు జరిగాయి. బీజేపీకు కేటాయించాల్సిన స్థానాల గురించి చర్చ జరిగింది.  త్వరలో తిరుపతి లేదా అమరావతి సభ ద్వారా మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇవాళ జరిగే చర్చలతో బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావచ్చని సమాచారం. 

బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది కచ్చితంగా సాధ్యమైనంత త్వరగా క్లారిటీ రావల్సి ఉంది. ఎందుకంటే బీజేపీకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తారనేది నిర్ణయం కావల్సి ఉంటుంది. దానిని బట్టే టీడీపీ, జనసేన పార్టీలు ఎక్కడెక్కడ సీట్లు పంచుకుటారో తేలవల్సి ఉంటుంది. అందుకే ఇవాళ్టి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

Also read: Ind vs Eng 5th Test: ఇండియా ఇంగ్లండ్ చివరి టెస్ట్ నేడే, ధర్మశాల పిచ్ రిపోర్ట్, ఇరు జట్ల బలాబలాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News