Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు గల ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నాం 12 గంటలకు రిలీజ్ చేసింది. ఈ టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనుంది. అయితే ఈ లక్కీ డీప్ టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం పది గంటలకు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ వెల్లడించింది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు.
శీఘ్ర దర్శన టికెట్లు విడుదల చేసిన టీఎస్ఆర్టీసీ
తిరుమల శ్రీవారిని దర్శించుకునే తెలంగాణ భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈనేపథ్యంలో అక్కడి నుంచి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ కొన్ని నెలల కిందటే బస్సులోనే దర్శన టికెట్లును బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సుమారు ఏడు నెలల్లోనే 77,200 మంది ఈ టికెట్లను బుక్ చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా శ్రీవారి శీఘ్ర దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు టీటీడితో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు నెలల్లో పెళ్లిళ్లు శుభకార్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఈ టికెట్లుకు డిమాండ్ ఉంటుందని ఆర్టీసీ ఆశిస్తోంది.
Also Read: Vanjangi Hills: ప్రకృతి చేసిన అద్భుతం.. వంజంగి అందం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook