Chilakaluripet Politics: అధికారం కోల్పోయిన అనంతరం కష్టాలు ఎదుర్కొంటున్న వారిలో మాజీ మంత్రి విడదల రజనీ కూడా ఉన్నారు. ఆమెపై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసు నమోదుపై రజనీ తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతోపాటు అధికారులపై మాజీ మంత్రి రజనీ మండిపడ్డారు. ఒక రకంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: YS Sharmila: 'మేనకోడలు, అల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ మామయ్య కుట్రలు'
చిలకలూరిపేటలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విడదల రజనీ మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 'పుల్లారావు ఒక అందమైన కట్టు కథ మళ్లీ నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మా మరిదిపై అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబం పై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు' అని రజనీ కేసుల చిట్టా విప్పారు.
Also Read: Chandrababu: 'ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల కోసం తొలి గంట నుంచి పని చేస్తున్నాం'
మళ్లీ అధికారంలోకి వైసీపీ..
పుల్లారావు గుర్తుపెట్టుకో... మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉందని మాజీ మంత్రి విడదల రజనీ హెచ్చరించారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయిన.. నువ్వెక్కడ దాక్కున్నా కచ్చితంగా నిన్ను లాక్కురావడం ఖాయం' అని ప్రతిపాటి పుల్లారావుకు రజనీ వార్నింగ్ ఇచ్చారు. ఆరోజు పుల్లారావు కి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
కుటుంబీకులపై కేసులు
'నా కుటుంబం జోలికి వచ్చినా.. మా కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన పుల్లారావు సహించే ప్రసక్తే లేదు' అని మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ స్పష్టం చేశారు. అవినీతి అక్రమాల్లో ఘనపాటి పత్తిపాటి అని ఆరోపించారు. '2019లో ఒక ఘటన జరిగిందని అందమైన కట్టు కథ అల్లి పుల్లారావు నాపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించాడు. హైకోర్టు నమోదు చేయమన్నదని చెబుతూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు' అని వివరించారు. '2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడు గుర్తుపెట్టుకో' అని రజనీ వెల్లడించారు
గుర్తుపెట్టుకోండి..
'మా పాలనలో మేము అభివృద్ధిపై దృష్టి పెడితే.. ఎన్డీయే ప్రభుత్వంలో పుల్లారావు అరాచకంపై దృష్టి పెట్టారు. టీడీపీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు... అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలను జైలుకు పంపిస్తే కచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది' అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని మాజీ మంత్రి విడదల రజనీ సంచలన ఆరోపణలు చేశారు.
పుల్లారావ్.. నేను ఇంకా 30 ఏళ్లు రాజకీయం చేస్తా.. నువ్వు ఎక్కడున్నా.. ఏ ఊరిలో దాక్కున్నా లాక్కొచ్చి వడ్డీతో సహా రిటర్న్ ఇచ్చేస్తా
ఎవ్వరినీ వదిలపెట్టం.. అందరి సంగతీ తేలేస్తా
-@VidadalaRajini మాస్ వార్నింగ్🔥🥵
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) February 8, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.