AP Cabinet Ranks: వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని గుర్తుచేశారు. ప్రజల ఆశలు.. ఆకాంక్షలను నెరవేర్చేందుకు తొలి రోజు, తొలి గంట నుంచి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నట్లు వెల్లడించారు.
Also Read: YSRCP Joinings: రేపు వైసీపీలోకి శైలజానాథ్: వైఎస్ షర్మిలకు షాక్.. జగన్‌కు బూస్ట్
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. అధికారంలోకి వచ్చిన 9 నెలలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఒక పోస్టు చేశారు. తన ప్రభుత్వం చేస్తున్న పనులు.. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేశారు. 'పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నట్లు' తెలిపారు. 'ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం' అని స్పష్టం చేశారు.
Also Read: Employees PRC: ఉద్యోగులకు పీఆర్సీ, ఒకటో తారీఖున జీతాలు ఎక్కడ?: వైఎస్ జగన్
'లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. సమష్టి పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తా. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప.. విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.
'ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడడంతోపాటు ఒకరితోఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది' అని వివరణ ఇచ్చారు.
'పీపుల్ ఫస్ట్ విధానంతో నేను, నా సహచర మంత్రులంతా పనిచేస్తున్నాం. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాం. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.