Weather Report: ఏప్రిల్లో రోజులు గడిచేకొద్ది భానుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. కేవలం తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా భానుడి భగభగలకు ప్రజలు అల్లాతున్నారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా మరో 5 రోజులు పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఐఎండీ వెల్లడించింది. గాలిలో తేమ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, కర్ణాటక , పశ్చిమ బెంగాల్, కేరళ, బిహార్‌లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. చాలా చోట్ల అర్దరాత్రి దాటినా ఉష్ణోగ్రతలు చల్లబడటం లేదు.
తూర్పు మధ్య ప్రదేశ్‌లో కూడా రాత్రివేళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తంగా ఎండల్లో తిరిగే వారు.. తలపై ఏదైనా ఖర్చీఫ్, టోపీ లాంటి పెట్టుకోవాలి. అంతేకాదు అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు నీళ్లు క్యారీ చేయడం ఉత్తమం. కొబ్బరి బొండం నీళ్లతో పాటు పండ్లను.. ఇతర ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఒంట్లో ఉన్న వేడి చల్లారుతోంది. మరోవైపు ఇతర బాండ్ల శీతల పానీయాలైన కోక్, పెప్సీ, థమ్స్ అప్ వంటి వాటికి దూరంగా ఉండటం బెటర్.
Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్ హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter