ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) విషయంలో నెలకొన్న సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) దృష్టి సారించారు. ప్రధాని మోదీ ( Pm modi ) కు లేఖ రాశారు. సిడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణల్ని ఆమోదించాలని కోరారు.
ఏపీ పోలవరం ప్రాజెక్టు విషయంలో గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. 2014 అంచనాను మాత్రమే కేంద్రం ఆమోదిస్తుందని ప్రకటించడంతో చెలరేగిన వివాదం ( Polavaram dispute ) ఇంకా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతుందనే ఆందోళన నెలకొంది. ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా దృష్టి పెట్టిన సీఎం జగన్..ప్రధానమంత్రి నరేంద్రమోదీకు 7 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు గురించి, పునర్విభజన చట్టం గురించి స్పష్టంగా లేఖలో రాశారు.
సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో అంశాలు
సీడబ్ల్యూసీ ( CWC )సిఫార్సు చేసిన సవరణలను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్ట్ జీవనాడి అని , ప్రాజెక్ట్ పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ( Ap Reorganisation act ) ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పారు. Also read: AP: పోలవరంపై ఇంప్లీడ్ పిటీషన్ వేసి కేసు వాదిస్తాను: ఉండవల్లి
ఇక 2017-18 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55 వేల 656.87 కోట్లని.. నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యం కారణంగా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించాలన్న 2014, ఏప్రిల్ 29 కేబినెట్ నిర్ణయం ( Central Cabinet ) ప్రకారం ప్రాజెక్ట్ ఖర్చు పెరిగితే కేంద్రమే భరించాలన్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని కేంద్ర జలవనరుల శాఖ 2017 మే 8న రాసిన లేఖలో పేర్కొందని జగన్ తెలిపారు.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra pradesh ) ఇప్పటివరకూ 12 వేల 520 కోట్లు ఖర్చు పెట్టిందని.. కేంద్రం 8 వేల 507 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఇంకా 4 వేల 013 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే ఇటీవల అంటే అక్టోబర్ 12న సాగునీటి కాంపొనెంట్ ను తొలగించడం చట్టం ప్రకారం విరుద్ధమని చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టు కోసం 17 వేల 656 కోట్లు వెచ్చించామని..ఇప్పుడీ సమయంలో కొత్త షరతులు పెడితే ప్రాజెక్టు నిలిచిపోతుందన్నారు. భూసేకరణ, పునరావాసానికే భారీగా ఖర్చుఅవుతుందని..నిధుల విడుదలలో జాప్యం చేస్తే అంచనా వ్యయం మరింతగా పెరుగుతుందన్నారు.
2013-14 ప్రకారం కేవలం 20 వేల 398 కోట్లే ఇస్తానంటే..ఎలా అని ప్రశ్నించారు. పునరావాసం, భూసేకరణకే 28 వేల 191 కోట్లు అవుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని అడిగారు. దేశ ప్రధానిగా మీరు తక్షణం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడండి. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించండి. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయండి అంటూ వైఎస్ జగన్ ..మోదీను విజ్ఞప్తి చేశారు.
అంచనా వ్యయం పెరిగిన క్రమం
2005-06లో పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 10 వేల 151 కోట్లు
2010-11లో 16 వేల 010 కోట్లు
2013-14లో 28 వేల 919 కోట్లు
2017-18లో 55 వేల 656 కోట్లు
Also read: Polavaram; పోలవరం ప్రాజెక్టు పరిస్థితికి కారణం ఎవరు ? అసలేం జరిగింది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe