AR Rahman: విడాకుల విషయమై ఎక్స్ వేదికగా స్పందించిన రెహమాన్..

AR Rahman: దక్షిణాది సహా భారతీయ ప్రేక్షకులు మెచ్చిన సంగీత దర్శకుడు తన వివాహా బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. దాదాపు పెళ్లై 29 యేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న ఏముందో .. ఆ సంగతి పక్కన పెడితే విడాకుల తర్వాత తొలిసారి రెహమాన్ స్పందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 20, 2024, 09:59 AM IST
AR Rahman: విడాకుల విషయమై ఎక్స్ వేదికగా స్పందించిన రెహమాన్..

AR Rahman: ఏఆర్ రెహామాన్ ప్రపంచ ప్రేక్షకులు మెచ్చిన సంగీత దర్శకుడు. అంతేకాదు తన మ్యూజిక్ తో ఆస్కార్ అవార్డును సైతం అందుకున్నారు. తాజాగా ఈయన తన భార్యకు విడాకులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. తాజాగా డైవోర్స్  విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. మేము ఎంతో ఆనందంగా మా ముప్పై యేళ్ల వివాహా వార్షికోత్సవాన్ని చేసుకోవాలని  ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిసింది.

ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఏఆర్‌ రెహమాన్‌. సైరాతో గడిపిన మూడు దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తన స్నేహితులకు, బంధువులు చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపాడు.

రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు కొన్నేళ్లుగా రెహమాన్ తో తనను మానసికంగా క్షోభకు గురిచేసినట్టు తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తమ 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలు అని.. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. అభిప్రాయ బేధాల కారణంగానే ఇద్దరి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించడం విశేషం.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News