YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!

YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్‌ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 29, 2024, 08:18 PM IST
YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!

YSR Family Assets: తన బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంపై వైఎస్‌ విజయమ్మ స్పందిస్తూ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తనకు ఇద్దరు బిడ్డలు సమానమేనంటూనే వైఎస్‌ షర్మిలను 'పాప' అంటూ ఆమెకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇద్దరు బిడ్డలకు ఆస్తుల పంపకం చేయలేదని.. కేవలం వారి పేర్ల మీద తన భర్త వైఎస్సార్‌ ఆస్తులు రాశాడని ఆస్తులు పంచలేదని చెప్పారు.

Also Read: YS Vijayamma: కన్న కొడుకు జగన్‌ మోసంపై వైఎస్‌ విజయమ్మ ఆవేదన.. అభిమానులకు సంచలన లేఖ

 

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తుల వివాదంతో తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారం.. విమర్శలతో వైఎస్‌ విజయమ్మ కలత చెందారు. ఈ సందర్భంగా తమ కుటుంబ అభిమానులకు మంగళవారం వైఎస్‌ విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా తన ఇద్దరు బిడ్డలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించారు. జగన్‌, షర్మిలకు మధ్య ఆస్తులు ఏమేమి ఉన్నాయో లేఖలో తెలిపారు.

Also Read: Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు ఏపీకి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ?.. ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్‌ తొలి విజయం

 

'వైఎస్సార్‌ బతికి ఉండగానే ఆస్తులు పంచారనేది అవాస్తవం. వైఎస్సార్‌ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుంచి కొన్ని ఆస్తులు పాప (షర్మిల) పేరు మీద.. కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్సార్‌ చేసింది ఆస్తుల పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే' అని వైఎస్‌ విజయమ్మ స్పష్టం చేశారు.

విజయసాయి రెడ్డి ఆడిటర్‌గా, వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్షి సంతకం చేశారు. అయినా వాళ్లు అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. జగన్‌, షర్మిల ఇద్దరు నా పిల్లలు. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్సార్‌ ఆజ్ఞ నిజం' అని వైఎస్‌ విజయమ్మ తెలిపారు. 'ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం' అని వివరించారు. 'వైఎస్సార్‌ చివరి రోజుల్లో జగన్ ఓ మాట ఇచ్చారు. 'నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని' అని జగన్‌ మాట ఇచ్చింది కూడా నిజం' అని వెల్లడించారు.

'రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచకుండా ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నాం. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంపకాలు చేసుకుందామనుకొనేసరికి వైఎస్సార్‌ ప్రమాదంలో వెళ్లిపోయారు' అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. '2009 నుంచి 2019 వరకు పదేళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని రూ.200 కోట్లు పాప (షర్మిల) భాగానికి ఇచ్చారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60 శాతం, పాపకు (షర్మిల) 40 శాతం అయితే.. ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకొనేవారు. పాపకు సమాన వాటా ఉంది కాబట్టి వీటన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని' అని విజయమ్మ గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ జగన్‌ విడిపోద్దామని.. ఆస్తులు పంచుకుందామని చెప్పినట్లు వైఎస్‌ విజయమ్మ లేఖలో తెలిపారు. '2019లో ముఖ్యమంత్రి అయ్యాక రెండు నెలలకు.. డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్‌లో జగన్ ప్రతిపాదించాడు' అని వివరించారు. 'పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు. నాకు అల్లుళ్లు వస్తారు. నీకు అల్లుడు, కోడలు వస్తారు. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి  విడిపోదాం” జగన్‌ తెలిపినట్లు లేఖలో విజయమ్మ వెల్లడించారు. 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగిందని గుర్తు చేసుకున్నారు. 

'విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్‌కి, ఇవి పాప (షర్మిల)కి  అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంఓయూనే ఇది. హక్కు ఉంది కాబట్టే  పాప (షర్మిల)కి రూ.200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. ఆ ఆస్తులు జగన్ గిఫ్ట్‌గా ఇస్తున్నవి కాదు. జగన్ బాధ్యతగా ఇస్తున్నవి. సరస్వతి షేర్స్ వంద శాతం, ఎలహంక ప్రాపర్టీ వంద శాతం పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ మాట ఇచ్చి ఇవ్వలేదు. ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది' అని విజయమ్మ వివరించారు. 'పాప (షర్మిల) భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్సార్‌ ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది' అని విజయమ్మ స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News