Ysrcp MLA Ambati Rambabu: ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు ఈ మహ్మమారి. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు (MLA Ambati Rambabu) మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో ఆయనకు రెండుసార్లు వైరస్ సోకగా..తాజాగా మూడోసారి కొవిడ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించటంతో..తాను కొవిడ్ టెస్టులు చేయించుకున్నాని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌లోకి వెళ్తున్నానని... ఎవ్వరూ తనను డిస్టర్చ్ చేయొద్దని అంబటి కోరారు.
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2022
2020లో జూలైలో తొలిసారి అంబటికి కరోనా (Covid-19) సోకింది. ఆ తర్వాత కొద్ది రోజులకే కరోనా నుంచి కోలుకోగా.. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో రెండోసారి కరోనా బారినపడ్డారు. అప్పుడు వైరస్ ను జయించిన అంబటికి.. మళ్లీ ఇప్పుడు మూడోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read: Paritala Sriram: టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్...
ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో (Sattenapalli) నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసిన ఆయన... స్థానిక మహిళలతో కలసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఏపీలో కరోనా కేసులు (Corona Cases in AP) రోజురోజూకూ పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 5 వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి